జయశంకర్ భూపాలపల్లి: పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు, ఎంపీపీ విలాసాగర్ పాఠశాలలో పనిచేస్తూ అనారోగ్యంతో అకాల మరణం చెందిన పద్మ మృతికి సంతాపంగా జిల్లా మరియు మండల నాయకులు నివాళులు అర్పించారు. ఈ రోజు పెద్దకర్మ సందర్భంగా ఆమె స్వగ్రామమైన నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘంలో సభ్యురాలిగా ఉన్న పద్మకు పి ఆర్ టి యు తెలంగాణ సంక్షేమ నిధి నుండి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె భర్త యాదగిరి రెడ్డికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి సభ్యుని సంక్షేమానికి పి ఆర్ టి యు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు న్. సురేష్, రాజశేఖర్, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: