జయశంకర్ భూపాలపల్లి: పి.ఆర్.టి.యూ తెలంగాణ రాష్ట్ర సంఘం తరపున సభ్యుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సభ్యురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పి.ఆర్.టి.యూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రెగురి శుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన ఎం.పి.పి.ఎస్. విలాసగర్ (ఎస్‌సి) పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి వై. పద్మ గారి కుటుంబానికి సంఘం సహాయక హస్తం అందించింది. సంఘం సంక్షేమ నిధి నుండి రూపాయల 1,00,000 చెక్కును మరణించిన ఉపాధ్యాయురాలి భర్త శ్రీ యాదగిరి రెడ్డి గారికి పెద్దకర్మ రోజున వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యూ మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు ఎన్. సురేష్, ఎస్. రాజశేఖర్ రావు, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున వై. పద్మ గారి కుటుంబానికి సంతాపం తెలియజేసి, అవసరమైన సహాయాన్ని అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

Post A Comment: