చౌటుప్పల్ : చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదానం కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి – విప్లవ్ కుమార్ గౌడ్ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ – “అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుప్రాప్తం, ఈ సేవలో భాగం కావడం మా అదృష్టం” అని అన్నారు. అయ్యప్ప స్వామి మాలదారులు, శివదీక్ష – హనుమాన్ దీక్ష మాలదారులు విప్లవ్ కుమార్ గౌడ్ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు – అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకుడు తొర్పు నూరి నర్సింహ గౌడ్, సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, మార్గం శేఖర్ యాదవ్, అందొజు సన్నిధ్ చారి, పోల్డాస్ రాజు, దాసరి మురళి స్వామి, బందరపు శివ గౌడ్, చెరుకు చైతన్య స్వాములు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిసర ప్రాంత రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: