డిసెంబర్ 22 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. దుర్గం నగేష్ నేటి జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ అన్నారు. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్’ గౌరవ డాక్టరేట్‌ను ఇటీవల అందుకున్న సందర్భంగా, ఆదివారం ఎన్టిపిసిలోని ఆయన నివాసంలో తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. దుర్గం నగేష్‌కు, ఆయన సతీమణి దుర్గం ప్రమీలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బందెల రాజశేఖర్ మాట్లాడుతూ, దుర్గం నగేష్ ఒక దినపత్రికలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తూనే ప్రజా సమస్యలపై వార్త కథనాలు రాస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక చైతన్యానికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు బందెల శ్రీనివాస్, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల నగేష్, సమతా సైనిక దళ్, సమతా ఫౌండేషన్ సభ్యులు చందనగిరి శివప్రసాద్, గూడూరి లవన్ కుమార్, దుర్గం వెంకట నరసయ్య, బెక్కం సాయి నిఖిల్, హరక్షిత తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: