టీమిండియా క్రికెట్ ప్లేయర్ జడేజా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా(ఇన్స్టాగ్రామ్)లో జడేజా చేసిన ఓ పోస్ట్ రిటైర్‌మెంట్ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. జడేజా రిటైర్‌మెంట్ ప్రకటించడం ఖాయంగానే కనిపిస్తోందని క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు చెబుతున్నారు. అయితే జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో తను వేసుకొనే జెర్సీ నంబర్ 8 ఫొటోను పోస్ట్ చేశాడు.ఫొటోకు ఎలాంటి క్యాప్షన్ అందించలేదు.ఒక జెర్సీ ఫొటోను మాత్రమే జడేజా షేర్ చేశాడు. జడేజా జెర్సీ ఫొటోతో రిటైర్‌మెంట్ పుకార్లు మొదలయ్యాయి."హ్యాపీ రిటైర్‌మెంట్ డే జడేజా" అంటూ అభిమానులు అప్పుడే జడేజాకు విషెస్ చెప్పడం స్టార్ట్ చేసారు.తన రిటైర్‌మెంట్ ప్రకటించాలనే ఆలోచనతోనే జడేజా జెర్సీ ఫొటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.
Post A Comment: