తెలంగాణ ప్రభుత్వం పేదలకు శుభ వార్తను అందించింది.తెలంగాణలో మరో 30 లక్షల మందికి త్వరలో రేషన్ లబ్ధి కలిగే అవకాశం ఉన్నట్లు అధికార ప్రతినిధి వర్గాలు తెలియజేశాయి.ఇటీవల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే డేటా ఆధారంగానే.. నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని.. ఫౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. కొత్తగా జారీ చేయనున్న కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి. ఈ జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నారు. గతంలో ఉన్న పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.అలాగే ఈ నూతన రేషన్‌కార్డుకు సంబంధించిన డిజైన్ ప్రక్రియకు ఇంకొంత సమయం పట్టే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు తెలిపారు.
Post A Comment: