- BREAKING NEWS
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది... మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు గల్లంతుకాగ.. వారిలో ఐదుగురి ప్రాణాలు పోయాయి.. ఇద్దరిని స్థానికులు కాపాడారు.. చనిపోయిన వారంతా 20 ఇళ్లలోపు వారే ఉన్న యువకులే.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఈ యువకులు ఈ రోజు కొండపోచమ్మ సాగర్ డ్యాం వద్దకు వెళ్లారు. ఈత కొట్టెందుకు డ్యామ్ లో దిగి.. అంతా మునిగిపోయారు.. ఏడుగురు యువకులు కూడా గల్లంతు కాగా,వారిలో ఐదుగురు నీట మునిగి చనిపోతే, ఇద్దరిని.. స్థానికులు కాపాడారు.
చనిపోయినవారిలో ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్ (20 సం||), లోహిత్(17 సం||), చీకట్ల దినేశ్వెర్ (17సం||), సాహిల్ (19సం||), జతిన్ (17సం||) గా గుర్తించారు.. కోమరి మృగంక్, ఎండి ఇబ్రహీం ఇద్దరూ బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఫోన్లో సెల్ఫీ కోసం డ్యామ్‌లోకి యువకులంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఏడుగురు డ్యామ్‌లోకి దిగారని పేర్కొంటున్నారు.ఐదుగురు నీటిలో మునిగితే, వీరిలో ఇద్దరు మాత్రమే బయటపడ్డారని స్థానికులు తెలియజేశారు.
Post A Comment: