ఉత్తర ప్రదేశ్‌లో ఈనాడు అనుకోకుండా ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం యొక్క రెండవ అంతస్తు పైకప్పు క్షణాలలో నిర్మాణ పనులు జరుగుతుండగానే కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో అనేక మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయినారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి పలుసహాయక చర్యలు చేపట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా శిథిలాల కింద ఉన్న కూలీలను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. మొత్తంగా 23 మంది కూలీలను బయటకు తీసుకురాగా.. 20 మందికి స్వల్ప గాయాలు కాగా,మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం దీనిలో పనిచేసే కూలీలను స్థానికంగా ఉన్న దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
Post A Comment: