చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
సమక్షంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కంది లక్ష్మా రెడ్డిలు మంగళవారం హైదరాబాద్ లో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈటెల రాజేందర్ వారికి కాషాయ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో టిఆర్ఎస్,
కాంగ్రెస్ మూలన పడనున్నాయన్నారు. బిజెపి అన్ని విధాలుగా పుంజుకొని అధికారం సాధించడం ఖాయమన్నారు. కార్య కర్తలు అధైర్య పడవద్దని, రానున్న రోజులన్నీ బిజెపివే అన్నారు.
Post A Comment: