మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ ఎఫ్ సి ఎల్ ఎరువుల కర్మాగారం గతంలో ఎఫ్సీఐ పేరుతో ఎరువుల కర్మాగారం నడిచేది కొన్ని అనివార్య కారణాల వల్ల మూతపడి మళ్లీ పున ప్రారంభం ఆర్ ఎఫ్ సి ఎల్ పేరుతో కావడం జరిగింది ఎరువుల కర్మాగారం పున ప్రారంభం అవుతున్న సమయంలో మా ప్రాంతంలోని నిరుద్యోగులు అంతా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో ఎరువుల కర్మాగారం పునః ప్రారంభమైన సమయంలో కొంతమంది వ్యక్తులు కర్మాగారంలో ఉద్యోగాలు పెట్టిస్తామని ఆశ చూపి పర్మనెంట్ ఉద్యోగం పిఎఫ్ ఈఎస్ఐ ఉండడానికి క్వార్టర్ లాంటి అనేక ఆశలు చూపి సుమారు 700 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల నుండి మొదలుకొని 10 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి తీరా కర్మాగారంలో ఎటువంటి పర్మినెంట్ ఉద్యోగాలు పెట్టించకపోగా వారి డబ్బులు వారికి తిరిగి ఇవ్వకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెలదీస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు అందరూ కూడా సంబంధిత బాధ్యులను నిలదీస్తూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసి వారి డబ్బులు వారికి తిరిగి ఇప్పించాలని ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిరుద్యోగులు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి కొంతమంది ఆస్తులు అమ్ముకొని కొంతమంది అప్పులు చేసి ఉద్యోగం వస్తుందని ఆశతో డబ్బులు పెట్టడం జరిగింది ఉద్యోగం రాకపోగా పెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్యలే శరణ్యం అంటూ మీడియా ముందుకు వచ్చి వారి గోడు వెళ్ళబోసుకుంటున్న తరుణంలో సమాజంలో ఎవరి అండలేని నిరాశ్రయులకు కనిపించే గుడి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు దైవ సామానులు అయిన తమరు ఇట్టి విషయంపై దృష్టి సారించి సుమోటోగా కేసు స్వీకరించి ఇట్టి విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి మరియు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపికి ఫిర్యాదు చేసినట్టుగా పెండ్యాల మహేష్ తెలియజేశారు అదేవిధంగా గౌరవ హైకోర్టు మరియు పోలీస్ శాఖ ఈ విషయం మీద దృష్టి సారించి తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా నిరంతర పోరాటం న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా నిరసనలు వ్యక్తం చేస్తూ చివరి బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు*ఈ పత్రిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు మైనార్టీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు నజీముద్దీన్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజీమ్ ఎన్ఎస్ఈ జిల్లా కార్యదర్శి ఉదయ్ రాజ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి నాయకులు తమ్మనవేని కుమార్ ఊరేటీ మహేష్ బీరెల్లి ప్రశాంత్ ఉప్పుల వెంకటేష్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు
Home
Telangana( తెలంగాణ )
*ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికీ రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేసిన బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్
Post A Comment: