మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడి ఆదివారం రాత్రి ముంబైలోని ఖార్‌లోని హోటల్ యూనికాంటినెంటల్‌లో జరిగిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా "నయా భారత్"లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను "గద్దార్" (ద్రోహి) అని పరోక్షంగా సూచిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆగ్రహించిన షిండే నేతృత్వంలోని శివసేన సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు కామ్రా షో జరిగిన హోటల్‌పై దాడి చేసి ఆస్తిని ధ్వంసం చేశారు. కమెడియన్ కామ్రాను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివసేన ఎంపీ నరేష్ మ్హాస్కే కామ్రాను హెచ్చరిస్తూ, అతను దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగలేని విధంగా చేస్తామని, బాలాసాహెబ్ థాకరే శివ సైనికులు అతన్ని వదిలిపెట్టరని హెచ్చరికలు జారీ చేశారు. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు. కునాల్‌ను "కాంట్రాక్ట్ కమెడియన్" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే శివసేన కార్యకర్తల దౌర్జన్యాన్ని ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: