కరీంనగర్: బీఆర్ఎస్ ర్యాలీలో బైక్ ఢీకొని గాయపడ్డ మహిళా కానిస్టేబుల్ ను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదివారం పరామర్శించారు. ఈ ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సీపీ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా కరీంనగర్‌లో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పద్మజను ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె కాలు విరగడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. చికిత్సకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కూడా ఆదివారం ఆమెను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
Post A Comment: