మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా, పడర్వార్ గ్రామంలో జరిగిన ఈ ఘోరమైన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి 45 ఏళ్ల ఇంద్ర కుమార్ తివారికి సుమారు 18 ఎకరాల పొలం మరియు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాయి. అతనికి వివాహం కాలేదు. తన స్థితిని గురించి, పెళ్లి కావడం లేదని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోనే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంద్ర కుమార్ తివారి పోస్ట్ చేసిన వీడియో చూసి, సాహిబా బాను అనే యువతి, ఆమె స్నేహితులు మరియు బంధువులు ఒక పథకం పన్నారు. తివారి ఆస్తిని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా, సాహిబా బానును ఇంద్ర కుమార్ తివారికి పరిచయం చేశారు. ఆస్తి కోసం సాహిబా బానును తివారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే, సాహిబా బాను, ఆమె స్నేహితులు మరియు బంధువులు కలిసి ఇంద్ర కుమార్ తివారిని దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత, తివారి మృతదేహాన్ని పడర్వార్ సమీపంలోని చెట్ల పొదల్లో పడేసి, అతని వద్ద ఉన్న డబ్బు, నగలు మరియు ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణమైన హత్యకు గల కారణాలపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో పడర్వార్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Post A Comment: