TG: మానవత్వాన్ని మర్చిపోయేలా చేసిన దారుణ ఘటన హనుమకొండ జిల్లా పున్నేలులో చోటుచేసుకుంది. కొడుకు కావాలనే అంధ విశ్వాసం, మూర్ఖమైన ఆశ ఒక తండ్రిని కిరాతకుడిగా మార్చింది. అజహరుద్దీన్ అనే వ్యక్తి తన గర్భిణి భార్యతో పాటు ఇద్దరు అమాయక కూతుళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ముంచి హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇంకోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో, తనకే ప్రాణంగా ఉండాల్సిన కుటుంబాన్ని చంపేయడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. “నాన్న” అని పిలిచిన ఆ చిన్నారుల ప్రేమ కూడా అతని గుండెను కరిగించలేకపోయింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్లపై వివక్ష ఇంకా సమాజంలో బతికే ఉందనే చేదు నిజాన్ని ఈ దారుణం మరోసారి బయటపెట్టింది.
Home
hanamkonda (హనుమకొండ)
వారసుడి మోజు.. రాక్షసుడిగా మారిన తండ్రి! ముగ్గురి ప్రాణాలు బలిగొన్న విషాదం

Post A Comment: