సంగారెడ్డి: మానవ హక్కుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా మానవ హక్కుల సంఘం ప్రతినిధులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) పరితోష్ పంకజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రజల హక్కుల పరిరక్షణ, పోలీస్-ప్రజల సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ప్రజల హక్కులను ఎవరైనా నిర్లక్ష్యం చేసినా, ఉల్లంఘించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ న్యాయం పొందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన మరింత పెరుగుతుందని సంఘం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: