మహా ముత్తారం, జూలై 19: కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల TPCC సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్టల వెంకటేష్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుట్టల వెంకటేష్ మాట్లాడుతూ, కొండగోర్ల బాపు సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, డివిజన్‌లోని గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులకు అండగా నిలుస్తూ, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేలా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొండగోర్ల బాపు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను కలుపుకొని వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని కొండగోర్ల బాపుకు శుభాకాంక్షలు తెలిపారు.

Post A Comment: