మల్హర్: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదివారం మల్హర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇటీవల వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ధైర్యం చెప్పారు. మొదట మల్లారం గ్రామంలో ఇటీవల మరణించిన కోట రాజయ్య కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం రుద్రారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో గాయపడిన అక్కపాక బొందయ్య, లక్ష్మీలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తదుపరి పాత రుద్రారం గ్రామంలో ఇటీవల మరణించిన జాడి మల్లయ్య కుటుంబాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మల్హర్ మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్




Post A Comment: