మహాముత్తారం, జూన్ 11: మహాముత్తారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్‌ను నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం సడువలి పాల్గొన్నారు. అలాగే నేతకాని రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజబాబు నేత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాముత్తారం మండలం వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎస్సై రమేష్‌ను కోరారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత పాటిస్తూ మండల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎస్సై రమేష్, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. మహాముత్తారం మండల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దుర్గం సడువలి, రాజబాబు నేతలు ఎస్సై రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Post A Comment: