కాటారం, జూన్ 11: కాటారం మండలంలోని బయ్యారం గ్రామానికి చెందిన పసుల పద్మ అనే మహిళ ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్థులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. పద్మ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే 99635 92134 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. గ్రామస్థులు కూడా ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: