మహాముత్తారం, జూన్ 10: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామంలోని బొడ్రాయి సమీపంలో ఓ ఇంటికి అత్యంత సమీపంలో విద్యుత్ తీగలు ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని భూపాలపల్లి సమాచార హక్కు చట్టం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కెర వెంకటస్వామి ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న తీగలను సురక్షిత ప్రాంతానికి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రమాద అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించే ముందు విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Home
Mahamutharam ( మహాముత్తారం )
కొర్లకుంటలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన.

Post A Comment: