కాటారం, జూన్ 10: కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి, మద్దులపల్లి, బయ్యారం, అంకుషాపూర్, కొత్తపల్లి, మేడిపల్లి, ఆదివారంపేట గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, తాగునీటి నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాల ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించారు. గ్రామసభల్లో మండల స్థాయి అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అజెండా అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ), మండల అధికారులు, వ్యవసాయ శాఖ (ఏఓ), ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండల పరిధిలో నిర్వహించాల్సిన అన్ని గ్రామసభలు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.








Post A Comment: