కాటారం, జూలై 27: రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా మంగళవారం కాటారం మండలంలోని రేగులగూడెం, కాటారం రైతువేదికల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఓ రైతువేదిక నుంచి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా జిల్లాలో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రస్థాయిలో వివరించనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాటారం మండలంలోని రైతులందరూ రేగులగూడెం, కాటారం రైతువేదికలకు హాజరై కార్యక్రమాన్ని వీక్షించాలని పూర్ణిమ కోరారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, మెళకువలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని రైతులను ప్రోత్సహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Post A Comment: