మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌కు చెందిన పంగ సురేష్, మారగోని బాపు (పులి బాపు), జాడి బాపులు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండ గొర్ల బాపు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, మార్క బాపు, మహిళా మండల ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గాదె రవీందర్, మహాముత్తారం టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకుడు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: