కాటారం, జూన్ 11: కాటారం కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లకు మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) సమర్థవంతమైన అమలుపై గురువారం జెడ్పీహెచ్‌ఎస్ కాటారం వేదికగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యు. సోమలింగం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆహార నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత, ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం, రాగి జావ ప్రాముఖ్యత, అయోడైజ్డ్ ఉప్పు వినియోగం, పోషకాహార లోపాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం కీలకమని పేర్కొంటూ, కుక్-కమ్-హెల్పర్లు సేవాభావంతో పనిచేసి విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: