కాటారం, జూన్ 11: మంథని నియోజకవర్గం కాటారం మండలంలోని గారేపల్లి ప్రాంతానికి చెందిన విలాసాగారం లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.2 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. బాధితురాలి పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి సహాయకులు సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సహకారంతో వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక భరోసా లభించిందని వారు పేర్కొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: