మహాముత్తారం మండలంలోని మీనాజిపేట గ్రామంలో “మొదటి 1000 రోజులు – బిడ్డ జీవితానికి బలమైన పునాది” అనే అవగాహన కార్యక్రమాన్ని ఈఓ నిహారిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భధారణ దశ నుండి బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్ల వయస్సు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు, గ్రామస్తులకు వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, అదనపు పౌష్టికాహారం, బాలల అభివృద్ధి మైలురాళ్లు, బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పాటించాల్సిన 6 ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లి మరియు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post A Comment: