మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని పలుగుల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేందుకు అవసరమైన కంకర కూడా రోడ్డుపై వేయలేని పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు.
రోడ్డు పనులు ప్రారంభం కాకముందే పాలాభిషేకాలు, విజయోత్సవాలు నిర్వహించి ప్రజలను నమ్మించారని, కానీ నేటికీ రోడ్డు పనుల్లో ఎలాంటి పురోగతి లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. రహదారి అధ్వానంగా ఉండటంతో స్కూల్ విద్యార్థులు, బస్సులు, ఆటోలు, బైకుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా పాలకవర్గం రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలుగుల–మద్దెలపల్లి రహదారిపై కనీసం కంకర వేయించి తాత్కాలికంగా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Post A Comment: