కాటారం, జూలై 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ నాయకత్వం వహించారు. దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించేందుకు నాయకులు బయలుదేరుతున్న సమయంలో కాటారం పోలీసులు వారిని అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో కాటారం మండల కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను, నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని పాగె రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, మహాముత్తారం మండల బీజేపీ అధ్యక్షుడు మేడిపల్లి పూర్ణచందర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Post A Comment: