కొత్తపల్లి గోరి, జూలై 24: మండలంలోని జగ్గయ్యపేట పోలింగ్ స్టేషన్ నంబర్ 258 పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్‌ఓ ముడుపు చిరంజీవిని శుక్రవారం అధికారులు ఘనంగా సన్మానించారు. ఎమ్మార్వో, బీఎల్‌ఓ సూపర్‌వైజర్ రాజయ్య శాలువాతో సత్కరించి అభినందించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలోని మొత్తం 1,071 మంది ఓటర్ల వివరాల సవరణ, ధ్రువీకరణ, గణన ఫారాల ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేసినందుకు చిరంజీవి సేవలను అధికారులు ప్రశంసించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలో విధులను సమర్థవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సిబ్బందిని కూడా అధికారులు అభినందించారు.

Post A Comment: