జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం బయ్యారం గ్రామంలో సర్పంచ్ ఇనుగాల లింగయ్య ఆధ్వర్యంలో గ్రామసభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో పర్యవేక్షణ అధికారి కృష్ణ మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో కాలువ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితుల పేర్లను గ్రామసభలో చదివించారు. వారికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా పంచాయతీ కార్యదర్శి లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అనంతరం భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ ధర కంటే అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంవత్సరాలుగా భూమిని సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మరియు యాజమాన్య హక్కులు కల్పించాలని డిప్యూటీ తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు గుంటి శ్రీనివాస్, సురేందర్, మహేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఇరిగేషన్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ రమా, విఆర్‌ఏలు ఓదెలు, భాను ప్రసాద్, మాజీ సర్పంచ్ సంజీవయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి రాజబాబు, నాయకులు అయిలి శ్రీనివాస్, గోగు సమ్మయ్య, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ అయిలి రాజబాబు, కారోబార్ మీర్జా సాబీర్ బేగ్, పారిశుధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: