వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు,  పాఠశాలలో మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను  ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరమ్మతులు చేయాల్సిన పనులను ఆయన పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ,  మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు,  ప్రభుత్వ పాఠశాలలో మరమత్తులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన సంబందిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  అన్ని పాఠశాలలో నూరు శాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10  వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   టెండర్ ప్రక్రియ పూర్తి అయిన పనులకు అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. టెండర్ పూర్తి అయిన పనులను తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న "వెల్ఫేర్ వీక్" సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో సంబంధిత శాఖల సంక్షేమ అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల  లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు  సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు "వెల్ఫేర్ వీక్" నిర్వహణలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటిలో ముఖ్యంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు సంక్షేమ హాస్టళ్లను  అధికారులు  సందర్శించి హాస్టల్ భవనాలు మరియు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా చూడాలన్నారు. ఏప్రిల్ 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధి గురించి విద్యార్థుల పురోగతి గురించి చర్చించడం,  తల్లిదండ్రులను మాట్లాడించడం మరియు వారి  నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం చేయాలన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని తెలిపారు. ఏప్రిల్ 24 తేదీన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం వివిధ అవకాశాలపై అవగాహన కల్పించడం, వాటిలో నమోదు అయ్యేలా చూడడం మరియు ఉపాధి అవకాశాల కల్పించే ఉద్దేశంలో  నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  భూపాలపల్లి, కాటారం ఏటిసి కేంద్రాల్లో విద్యార్థులకు వృత్తి నైపుణ్యం తరగతులు నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 25 తేదీన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్ లెర్నింగ్ మరియు వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగహన కల్పించాలని సూచించారు. ఏప్రిల్ 26 తేదీన బడిబాట /హాస్టల్ బాట కార్యక్రమం నిర్వహించాలని, దీనిలో భాగంగా పాఠశాలలో ఖాళీలను గుర్తించడం ప్రత్యేక డ్రైవ్ పెట్టి విద్యార్థులను గుర్తించాలని,  అలాగే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా ఖాళీ లను భర్తీ చేయాలని సూచించారు. వెల్ఫేర్ వీక్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమానికి  రిపోర్టులు పంపాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బిసి సంక్షేమ అధికారి ఇందిర, పీఆర్, గిరిజన, టీడబ్లుఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపిడివో  సురేందర్, సర్పంచ్ విజయ, ప్రిన్సిపల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: