జయశంకర్ భూపాలపల్లి జిల్లా TGSRTC జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి డిపో ముందు జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని కార్మికులకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిపో ముందు కార్మికులతో కలిసి కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ రవి పటేల్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక డిమాండ్లు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో 30% ఫిట్మెంట్ అమలు చేయాలని, అలాగే 2025 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి ₹400 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులపై ఉన్న పనిభారం తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వెంటనే ఆర్టీసీకి అందించాలని, అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలని, అధిక సంఖ్యలో బస్సులను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రవి పటేల్ గారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికుల న్యాయపరమైన పోరాటంలో తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక సంఘం నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతల సంపత్, జిల్లా కోశాధికారి జిలకర శ్రీను, జిల్లా కమిటీ సభ్యుడు వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' సంపూర్ణ మద్దతు!


Post A Comment: