జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన లింగంపల్లి సమ్మక్క కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతి రావు, బూత్ అధ్యక్షులు రాజేశ్వరరావు, నాయకులు పాపారావు, తిరుపతి రావు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి

Post A Comment: