కాటారం మండలంలోని అంకుషాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ప్రోగ్రాము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా సర్పంచ్ కల్పన దేవయ్య హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగపరుచుకోవాలని సూచించడం జరిగినది అలాగే చిరుధాన్యాలకు మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించడం జరిగినది. సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను ముర్రుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది అలాగే వెయ్యి రోజుల ( గర్భిణీ దశ నుండి రెండు సంవత్సరముల పిల్లల వరకు జరిగే అభివృద్ధి )ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది ప్రీస్కూలు ఆవశ్యకతను గురించి వివరించడం జరిగినది. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో స్వేచ్ఛ వాతావరణంలో ఆటపాటల ద్వారా విద్యను అందించడం వలన సమగ్ర అభివృద్ధి జరుగుతుందని వివరించడం జరిగినది. ప్రథమ్ ఎన్జీవో సమ్మయ్య గారు పాఠశాల సంసిద్ధత మరియు బాలమేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదనంతరము గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన దేవయ్య ఉపసర్పంచ్ ఉమా శంకర్ అంగన్వాడి సూపర్వైజర్స్ శివరాణి రమాదేవి వ్రతం ఎన్జీవో సమ్మయ్య గారు కార్యదర్శి రజిత వార్డు మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తుల భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Post A Comment: