కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో రేపు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఈరోజు ప్రముఖ నేతలు సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అందించనున్న “తీపి కబురు”గా ఏప్రిల్ 20న రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ బాబు , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను వారు సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే , ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రేపటి సభ విజయవంతం కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Post A Comment: