కాటారం, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా స్థలాన్ని అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) సభా ప్రాంగణాన్ని సందర్శించి వివిధ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. సభకు వచ్చే ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని జనరల్ పార్కింగ్‌తో పాటు VIP, VVIP పార్కింగ్ స్థలాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే త్రాగునీటి సౌకర్యాలు, తగిన లైటింగ్ ఏర్పాట్లు, శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహణ జరగేలా చర్యలు తీసుకోవాలని ఆర్గనైజర్లకు స్పష్టం చేశారు. భద్రతా పరమైన అంశాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ శాఖల అధికారులు, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

Post A Comment: