జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నాగరాజు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల జిల్లా కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నాగరాజు సేవలను కొనియాడుతూ, ఆయన న్యాయపరమైన కృషి మరియు నిష్పక్షపాత ధోరణిని ప్రశంసించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ట్రెజరర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. అలాగే న్యాయవాదులు రవికుమార్, రాజేందర్, నీలం ప్రశాంత్, చీర్ల అశోక్, సతీష్, సురేందర్, ఎండీ రఫీ, రాయం రమేష్, శ్రీనివాస్ చారి, వసంత, ప్రియాంక, సంధ్య తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి నాగరాజు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా ప్రజల ప్రేమ, సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

Post A Comment: