కాటారం, ఏప్రిల్ 28: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాటారం మండలంలోని కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల భద్రత రక్షణ మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్‌ల ఫోరం డివిజన్ అధ్యక్షుడు, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలని, ఈనాటి యువతే రేపటి దేశానికి వెన్నెముకవంటివారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయిని సరిగా ఉంచుకోవడం అవసరమని తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం నిర్వహించే ‘ఆరోగ్య మహిళా’ క్యాంపులకు హాజరై పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సఖి సెంటర్ ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ కిశోర బాలికలు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఎదుగుతున్న వయసులో అనవసర ఆకర్షణలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా బాధ్యత వహించే వ్యక్తులతో పంచుకోవాలని, అవసరమైతే హెల్ప్‌లైన్ నంబర్లు 1098, 181, 100లను వినియోగించుకోవాలని వివరించారు. సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ రక్తహీనత నివారణ కోసం చిరుధాన్యాలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై అంగన్వాడీ టీచర్ల సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ఏపీఎం రవికుమార్, సఖి DHEW గాయత్రి, సూపర్వైజర్లు శివరాణి, వీణ, ఎండి పర్జన, మహిళా సంఘ ప్రతినిధులు, సీసీలు, వీవోఏలు, అంగన్వాడీ టీచర్లు మరియు కిశోర బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: