మేడి గడ్డ టివి న్యూస్ టేక్మాల్*ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్*:
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మల్ మండల పరిధిలోని కాధ్లుర్ గ్రామంలో గ్రామ పెద్దలు పాల్గొని పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాధ్లుర్ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పీర్లను ప్రార్థించానమని గ్రామంలో కులమతాలకతీతంగా జరుపుకునే ఈ మొహర్రం పండుగ గ్రామ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నారు ముస్లిం మైనార్టీ సోదరులు హిందూవులు పీర్ల పండుగను డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈమొహరం పండుగ ఉత్సవాలు జరుపుకుంటామనీ ప్రతి సంవత్సరం మొహరం ఉత్సవాల సందర్భంగ కాధ్లుర్లో పీర్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామాని తెలిపారుఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం తెలిపారు. సెంట్రల్, ఈస్ట్ మరియు వెస్ట్ జోన్ పరిధిలో పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని.
చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదని
సూచించారు.
ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువులోకి, నాలాలు , వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.
స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉధృతి తో రోడ్లు తెగిపోయినా, ఉధృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.
వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.
వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈ నెల 31వ తేదీన జరగబోయే సహకార సంఘం కళాశాల భూమి పూజకు సహకార, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రానున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు.బుధవారం
ములుగు రోడ్డు లోని సునీల్ గార్డెన్స్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
మాట్లాడుతూ ఒక్కరి కోసం అందరం - అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా అనేక రంగాల వారు సహకార సంఘాలు గా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకరికి ఒకరు అండ గా నిలబడుతూ సహకార సంఘాలని బలోపేతం చేశారు అని తెలిపారు.అదేవిధంగా సహకార సంఘాల విజ్ఞప్తి మేరకు సహకార కళాశాల ఏర్పాటు కొరకు మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి ని మరియు జిల్లా కలెక్టర్ ని కోరిన వెంటనే హన్మకొండ అంబేద్కర్ భవన్ ప్రక్కన స్థలాన్ని కేటాయించడం జరిగింది అని తెలిపారు. కావున కళాశాల ఏర్పాటు కొరకు ఈ నెల 31వ తేదీన భూమి పూజ కార్యక్రమం అనంతరం అంబేద్కర్ భవన్ లో సహకార సంఘాల సమావేశం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు కావున సభ్యులు అందరు పెద్ద ఎత్తున హాజరు అయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , కార్పొరేటర్లు విజయ లక్ష్మీ సురేందర్, నర్సింగ్ ,కల్పలత సూపర్ బజార్ ఎండి జగన్మోహన్ రావు, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ షఫీ, సహకార సంస్థ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్, సహాకార సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పెండింగ్‌లో వున్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ (కోఆర్డినేషన్)ప్రదీప్ కుమార్ త్రిపాఠీ అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ మానేజ్మెంట్ గ్రూప్ పోర్టల్‌లో వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల అన్ని వివరాలను నమోదు చేస్తుంది అని తెలిపారు.రైల్వేలు,రోడ్డు రవాణా, హైవేల నిర్మాణలలో పనులు వేగవంతం చేయాలి అని అన్నారు.చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ పనులు యుద్ధ ప్రతిపదికన పూర్తి చేయాలి అని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ కలెక్టరేట్ నుండి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ రమేష్ కుమార్ జీఎం ఇండస్ట్రీస్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ బుధవారం తెలిపారు. జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యాత్రగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, జిల్లా పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే నిమిషాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పి పేర్కొన్నారు.
మానేరు, గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెల్లద్దు అని అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని ఎస్పి సూచించారు.
గ్రామాలలో పాత ఇండ్లు, గుడిసే లలో,శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు.
జిల్లాలో ఎక్కడైనా వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఇతర శాఖ ల అధికారులతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షం మరియు బలమైన గాలుల సమయంలో విద్యుత్ తీగలు, స్తంబాలు మరియు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, అలాగే తడి చేతులతో స్విచ్ బోర్డులు ముట్టకోవద్దని పేర్కొన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని ఎస్పి కరుణాకర్ సూచించారు.
ప్రజలందరూ ఈ భారీ వర్షాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలకు శాపంగా మారిందని, ఎడతేరిపి లేకుండా కురిసిన అతిభారీ వర్షాల వలన అన్నారం సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో అన్నారం, చండ్రుపెల్లి, నాగపెల్లి, మద్దుల పెల్లి, పల్గుల, కుంట్లం, పుస్కుపెల్లి, కాళేశ్వరం పంటలు గత మూడు సంవత్సరాలనుండి, ఐదు సార్లు యధావిధిగా మునిగిపోయాయిన, ఇప్పటికి ఒక్క ఎకరానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం ఇవ్వ లేదని, రైతులు అప్పులు తెచ్చి ప్రతి సంవత్సరం పెట్టుబడులు పెట్టి తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంత మంది వారి గ్రామాలను వదిలేసి సహజీవనం కోసం పట్టణాలకు వలస వెళ్లారు. గత సంవత్సరం భారీ వర్షాలకు నీటమునిగిన ఇండ్లకు కొంతమందికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు.అయ్యా సీఎం దొర, గత సంవత్సరం పక్క దేశాలవారు గోదావరి పరివాహక ప్రాంతాలపై క్లౌడ్ బరస్ట్ చేసారని చెప్పితివి. మళ్ళీ ఇది వారి కుట్రనేనా.. ఈ గోదావరి పరివాహక ప్రాంతలలో ఉండే రైతులు వారికీ ఏమి అన్యాయం చేసారయ, రైతులుగా పుట్టడం వారు చేసిన పాపమా శాపమా.?రైతుని రాజుని చేస్తా అంటివి, ఐదు సార్లు వాళ్ళ పంటలు మునిగిన పట్టించుకోకపోతివి. మీ ప్రభుత్వానికి రైతు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు దొర. ఇప్పటికైనా మునిగిపోయిన పంట చేనులు, పొలాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంజాయ్ మెంట్ సర్వే చేపించి, ఎకరానికి 30,000వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, ఈ భూములకు శాస్వత పరిస్కారం చేసి ఎకరానికి 30,0000లక్షల చొప్పున ఇచ్చి కే, రా ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్సీ సెల్ మహాదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కొండగొర్ల సంతోష్ డిమాండ్ చేసారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు.
కలెక్టర్ బుధవారం సాయంత్రం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, జిల్లా ఉన్నత అధికారుల తో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వివరాలను శాఖల వారీగా అధికారులను కలెక్టర్ అడిగారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పక్కాగా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని, అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ప్రభావంతో వ్యాధులు ముప్పిరిగొనకుండా ముందస్తుగానే అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని పీ.హెచ్.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని అధికారులకు సూచించారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ కార్య స్థానంలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన కాలం నాటి ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, భోజన వసతి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు వరద నీటి ప్రవాహం తగ్గిన మీదట పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. ఏక్కడా ప్రాణనష్టం సంభవించలేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు, ఈత సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగులోకి దిగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు.జిడబ్ల్యు ఎంసి ఆధ్వర్యంలో 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్.1800 425 1115కు కాల్ చేయాలన్నారు.
చౌటుప్పల్ ప్రతినిధి / ఉదారి కిషోర్
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 07,వార్డు సుందరయ్య కాలనీ మరియు శ్రీ కృష్ణ కాలనీలో తిరిగి పర్యటించారు గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీవెన్ రెడ్డి రాజు గారు డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా కాలనీ మొత్తం పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కామిషెట్టి శైలజ భాస్కర్, పాశం సంజయ్ బాబు,గుండెబోయిన వెంకటేష్, కుక్కల నరసింహ, గుండెబోయిన ఐలయ్య, రొండి నరసింహ, దంటిక శంకర్, నూనె రామచంద్రయ్య కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన పంతంగి శివశంకర్ (32) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి
కుటుంబాన్ని సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్
బాబు పరామర్శించారు అనంతరం వారి కుటుంబానికి 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో భాజపా నాయకులు| గోశిక బిక్షపతి, గోశిక పురుషోత్తం, వనం ధనంజయ, పోలోజు శ్రీనివాస్ చారి,
భావనాఋషి, ధనుంజయ, మురళి, నరహరి, హరీష్, మహేష్ పాల్గొన్నారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
కాళేశ్వరం: ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని, బదిలీపై వెళ్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి దంపతులు, పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకొని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, ఈశ్వరునికి ప్రీతివంతమైన సోమవారం రోజున దర్శించుకొనుటకు ఆలయంకు చేరుకోగా, వారిని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, గర్భాలయంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లకు పాలాభిషేకం పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారి ఆలయంలో అర్చన, దర్శననంతరం ఆలయ ధర్మకర్తలు శ్యాంసుందర్ దేవ్డ, ఆరేల్లి సత్యనారాయణ గౌడ్, కామిడి రాంరెడ్డి, అడప సమ్మయ్య స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సీఐ కిరణ్ కుమార్, కాళేశ్వరం ఎస్ఐ లక్ష్మన్ రావు పోలీసులు పాల్గొన్నారు.
మేడిగడ్డ న్యూస్ టేక్మాల్*ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని సాలోజిపల్లి గ్రామ పంచాయతీలలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించిన అందోల్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రీష. ఈ సందర్భంగా వారు సాలోజిపల్లి గ్రామపంచాయతీలో ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై 2024 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ధరణి పోర్టల్ రద్దుచేసి పోడు భూములకు పట్టాల పంపిణీ, 500కు వంట గ్యాస్ వివిధ గ్రామలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు ,కావున ప్రజలందరూ రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, నాయకులు.విట్టల్ గౌడ్ . యూత్ అధ్యక్షులు సంగమేశ్వర గౌడ్ . టేక్మాల్. మండల ఎన్ ఎస్ యు ఐ.అధ్యక్షులు.చాకలి అడివ య్య. ఎస్టీ సెల్. సేవాలాల్ రామావత్ అధ్యక్షులు.మాణిక్యం,కిషోర్, సంగమేష్ గౌడ్. మాన్ కిషన్.కాంగ్రెస్
సాలూజిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల యాదగిరి. పార్టీ నాయకులు సొంగ రాజు. కోడపాక యాదగిరి. మహమ్మద్ రియాజుద్దీన్. వేముల విట్టల్. వడ్డే చెన్నయ్య. వడ్డే హాన్మయ్య. నాగయ్య. పార్టీ నాయకులు కాంగ్రెస్
పార్టీ మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వడ్డేపల్లి లో శ్రావణమాసం చివరి ఆదివారం రోజున ఘనంగా జరుపుకునే పోచమ్మ తల్లి బోనాల పండుగకు ముఖ్యఅతిథిగా హాజరై బోనం సమర్పించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని వారి నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఎమ్మెల్సీ కవిత చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా హాజరవుతానని తెలుపడం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈవీఎం, వివి ఫ్యాట్ ల ద్వారా ఓటు వేయడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని నూతన అదనపు కలెక్టర్ సిహెచ్. మహేందర్ జీ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం, వివి ప్యాట్ ల ప్రదర్శన కేంద్రాన్నిఅదనపు కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఈవీఎం, వివి ప్యాట్ ల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు . వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానం పై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలనీ సిబ్బందికి సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటు వేయడం ఎలా అనే అంశంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఓటరు https://www.nvsp.in పోర్టల్ లో తమ ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేసి వివరాలను పరిశీలించుకోవాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో S.కిరణ్ ప్రకాష్ ఏఓ కలెక్టరేట్, ఎం. జ్యోతి వర లక్ష్మీదేవి, సూపరింటెండెంట్,
ఇవి శ్రీనివాస్ రావు ఐఎన్టీయూసీ సి,
కుసుమ శ్యాంసుందర్ టిడిపి, జయపాల్ రెడ్డి బిజెపి,
నాగవల్లి రజినీకాంత్ వైఎస్సార్,
ఎండీ సయ్యద్ ఫయాజుల ఎంఐఎం, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా అదనపు కలెక్టర్ గా సిహెచ్. మహేందర్ జీ గురువారం అదనపు కలెక్టర్ సంధ్యా రాణి నుండి బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరంలో ఈరోజు తెలంగాణ ట్రైని ఐఏఎస్ అధికారులు ఉమాశంకర్, అమిత్, కిరణ్మయి, శ్రద్ద, శ్రావణమాసం పురస్కరించుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, దేవాలయం కు రాగా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ ఆధ్వర్యంలో, వారిని ఆలయ అర్చకుల బృందం రాజగోపురం నుండి మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి, గర్భాలయంలోని స్వామి వారికి ప్రత్యేక పాలాభిషేకం పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయం లో అర్చన, దర్శనం, అనంతరం ఆలయ కార్యిర్వహణాధికారి మహేష్, ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, బండి రాజయ్య స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించారు.అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, మహాదేవపూర్ డిటి కృష్ణ పాల్గొన్నారు.
మహాదేవపురం మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీగా, బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని తెలిపింది. బుధవారం లోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా. మరోవైపు ఝార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి.మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/ హైదరాబాద్: అసలే నిధుల కటకట.. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితి. వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు కూడా ఆలస్యమవుతున్న పరిస్థితి. వివిధ వర్గాల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలకూ నిధులు సర్దలేని ఇబ్బంది. మరోవైపు.. సమీపిస్తున్న ఎన్నికలు. దీంతో ప్రభుత్వం హడలెత్తిపోతోంది. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ ఉపసంహరణకు కూడా పైసలు పూర్తిస్థాయిలో లేవు. దీంతో జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు సర్కారు ఎపుడు ఇస్తుందోనని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ మానసపుత్రిక అయిన దళితబంధు పథకం రెండో విడతకు సరిపడా నిధులు లేకపోవడంతోనే దాని అమలులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకు రూ.లక్ష సాయం పథకానికి అవసరమైన నిధులనూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బీసీ కార్పొరేషన్‌కు అందించలేదు. గొర్రెల పంపిణీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. ఇక గృహలక్ష్మి పథకం ప్రకటనలకే పరిమితమవుతోంది. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన రుణమాఫీ పథకం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాలేదు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయడంలేదు. వాస్తవానికి ఈ పథకాన్ని డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంతోపాటే కొనసాగిస్తామని, సొంత స్థలం కలిగి ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5-6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని 2018 మేనిఫెస్టోలోనే బీఆర్‌ఎస్ ప్రకటించింది. కానీ, చివరికి ఆర్థిక సాయంలో కోత విధిస్తూ రూ.3లక్షలే ఇస్తామని మాట మార్చింది. అది కూడా ఇంతవరకూ అమలు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటినీ పూర్తిగా కాకున్నా.. కొంత మేర అయినా అమలు చేయాలన్నా కోట్ల రూపాయలు కావాలి. కానీ, అవీ లేకపోవడంతో పథకాలన్నీ నామ్ కేవాస్తే అన్నట్టుగా తయారయ్యాయి.
*రుణమాఫీ పూర్తయ్యేనా?*
రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగా చేయలేదు. దీంతో అసలు రుణమాఫీ జరుగుతుందా? లేదా? అని రైతులు చర్చించుకుంటున్నారు. ఈ హామీ ఇచ్చే నాటికి రుణమాఫీకి రూ.21,557 వేల కోట్లు అవసరం పడుతాయని సర్కారు నిర్ధారించింది. కానీ, వీటిలో ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు రూ.1,207.37 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా రుణమాఫీ కోసం మరో రూ.20,351 కోట్లు కావాల్సి ఉంది. కానీ 2023-24 బడ్జెట్‌లో మాత్రం రుణమాఫీకి కేవలం రూ.6,385 కోట్లనే కేటాయించారు. ఈ నిధులను మినహాయించినా.. ఇంకా రూ.13,966 కోట్లు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది రుణమాఫీ పూర్తిగా జరగదని నిధుల కేటాయింపుతోనే స్పష్టమవుతోంది. కానీ, ప్రభుత్వం మాత్రం జమ చేస్తామనే చెబుతోంది. మరోవైపు గొల్ల, కురుమలకు అందిస్తామన్న గొర్రెల పంపిణీ పథకంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుందని భావించినా.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకానికి తన ఖజానా నుంచే నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పథకం అమలుకు రూ.4 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కావడంతో.. ఇప్పటికిప్పుడు అన్ని నిధులు ఎలా? అన్న చర్చ మొదలైంది.
*దళితబంధు రెండు విడతపై సందిగ్ధం..*
దళితబంధు రెండో విడత అమలు విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఇప్పటికిప్పుడు రెండో విడతను అమలు చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,29,800 మందికి అందించాలి. అంటే ఇందుకు దాదాపు రూ.12,900 కోట్లు అవసరమవుతాయి. అందరికీ కాకపోయినా.. సగం మందికి అంటే నియోజకవర్గానికి 650 మందికి చొప్పున అందించినా రూ.5,500 కోట్లు కావాలి. కానీ, ఇంతమందికి ఇప్పుడు అందించగలమా.. అన్నదానిపై ప్రభుత్వం యోచిస్తోంది. ఇక బీసీలకు రూ.లక్ష సాయం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో పొందుపరిచిన కులాల వారికి లబ్ధి చేకూరాలంటేనే దాదాపు రూ.4,500 కోట్లు అవసరమవుతాయి. కానీ, మొదటివిడత కింద బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు రెండు దశల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలోనూ రూ.100 కోట్లే విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో పథకం అమలుకు ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది.
*సకాలంలో అందని వేతనాలు..*
పథకాల సంగతి అటుంచితే.. ఉద్యోగులకు నెలానెలా అందాల్సిన జీతాలు కూడా సమయానికి అందడంలేదు. జీపీఎ్‌ఫలో నుంచి తమ అవసరాలకు కొంత నగదును తీసుకోవాలన్నా సర్కారు అనుమతి కావాల్సిందే. అందునా.. ఉద్యోగి కోరిన మేరకు పైసలు అందవు. ప్రభుత్వం ఇవ్వదల్చుకున్నంతే ఇస్తున్నదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు ఉద్యగ విరమణ చేస్తున్న వారికీ అందాల్సిన ప్రయోజనాలు సరిగా అందడంలేదన్న విమర్శలు వస్తున్నాయి..
పెద్దపల్లి:గోదావరిఖని:జూలై;17:రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్,విట్టల్ నగర్ లో మూఢనమ్మకాల పేరుతో ఇరుగు పొరుగు వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కొందరు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే గోదావరిఖని విట్టల్ నగర్ 13వ వార్డులో నివసిస్తున్న ఇసంపెల్లి లక్ష్మి, ఇసంపెల్లి లావణ్య లు వారి వీధిలో ఉన్న నాడం స్వప్న శంకరయ్య వారి ఇంటి ముందు గత కొన్ని రోజుల నుండి నిమ్మకాయలు,పిండి బొమ్మలు,పసుపు కుంకుమ,కోడి గుడ్లు లాంటి వస్తువులు పెట్టి, ఆ ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,ఆదివారం రాత్రి వనం లక్ష్మీనరసయ్య ఇంటి ముందు గల ఓ వ్యక్తి స్వప్న ఇంటి ముందు నిమ్మకాయ పసుపు కుంకుమ పెడుతుండగా చూసి పట్టుకొనగా,ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడని, వెంటనే 100 డయల్ చేయగా పోలీసులు వచ్చి ఉన్న సన్నివేశాన్ని చూసి పిలిచి అడగగా డోరు తీయకుండానే తను పెట్టలేదని తడబడినాడనీ,అది చూసి పోలీసులు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయమని తెలుపగా మరుసటి రోజు ఉదయం ఆ ఏరియా ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నామని కావున వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని,విట్టల్ నగర్ బస్తీ వాసులు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దీంతో స్పందించిన వన్ టౌన్ సిఐ విచారణ చేపట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్టు!.కాలనీవాసులు తెలిపారు...
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి రూరల్: టేకుమట్ల మండలంలోని సమీప పలు గ్రామాల నుండి ఈరోజు యువకులు 7200 తీన్మార్ మల్లన్న టీం లోకి అత్యధిక సంఖ్యలో చేరికలు జరిగినవి.టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలలో గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది.వారందరికీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువాలు కప్పి 7200 టీం లోకి ఆహ్వానించారు.తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్టిఆర్ 7200 తీన్మార్ మల్లన్న టీం లక్ష్యం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదసాధికులకు సత్వర న్యాయం, రాజకీయ ప్రజా ప్రతినిధులు పనిచేయకుంటే రీ కాల్ చేసే విధానాన్ని అవలంబిస్తుంది కాబట్టి, మల్లన్న టీం లో చేరడం జరిగిందని యువత చెప్పారు. ప్రశ్నించే గొంతు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని ప్రజలకు సౌకర్యవంతమైన పనులను, ఎన్నో సేవా కార్యక్రమాలు తీన్మార్ మల్లన్న చేస్తున్నాడని, అందులో భాగంగా రాజకీయ ఎజెండే ప్రధానంగా భూపాలపల్లి నియోజకవర్గము, తీన్మార్ మల్లన్న టీం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రవి పటేల్ పోటీ చేస్తున్నందున గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని టీం సభ్యులు ముక్తకంఠంతో హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య సైనికుడిలా పనిచేస్తూ, ఒక్కొక్కరు 100 మందిని తయారు చేయాలని రవి పటేల్ యువతను కోరారు. ఈ చేరికల ముఖ్య కార్యక్రమంలో జిల్లా నాయకులు అంబాల నరసయ్య, గండు కరుణాకర్, భూక్య కిరణ్, చంద్రన్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకన్నా అర్హత ఏముంటదని మల్లన్న ప్రశ్నించారు.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిపాజిట్లు కూడా రావని చేసిన వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న స్పందిస్తూ డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తానన్నారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు...
చౌటుప్పల్ మండల ప్రతినిధి/ఉదారి కిషోర్
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని లక్కారం మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటిఈద్గాలో మున్సిపల్ చైర్ పర్సన్
*గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు* గారు ముస్లిం సోదరులతో కలిసి మొక్కను నాటడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ MD బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, నాయకులు దండ అరుణ్ కుమార్, షాదిఖాన ఛైర్మెన్ MD ఖలీల్, ముషీర్, జమీర్, చోటెబాబా, కదీర్, జమీర్, ఇబ్రహీం, గోరేమియ, ఖరీం . నాఫీస్ .ఆలం . అలీం జంజీర్.అంజత్ మొల్సబ్.షమేం మొల్సబ్.మరియు మున్సిపల్ అధికారులు Ee రేణు కుమార్, సూపర్వైజర్ నరసింహ సిబ్బంది తదితరముస్లింసోదరులు పాల్గొన్నారు
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో సీజనల్ వ్యాధులను నియంత్రించడంలో సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, డి వార్మింగ్ డే, మిషన్ ఇంద్రధనస్సు, ఫైలేరియా మాత్రల పంపిణీ కార్యక్రమాల పైన నిర్వహించిన జిల్లా స్థాయి సమన్మయ సమావేశంలో మాట్లాడుతూ వైద్యశాఖ, మున్సిపల్, ఐసిడిఎస్, విద్యాశాఖ, డి ఆర్ డి ఓ, మెప్మా తదితరులు నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 20 న ఏడాది వయసు నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలు అందించాలని సంబoదిత అధికారులకు సూచించారు. నులి పురుగుల కారణoగా రక్త హీనత, ఎదుగుదల లోపించడం తదితర సమస్యలు ఎదురవుతాయన్నారు. మండల, గ్రామ స్థాయి లోని సమన్వయ కమిటీ ల ద్వారా నులి పురుగుల నివారణ లై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న మంది పిల్లలకు మాత్రలు అంద చేయాలన్నారు. మాత్రలు వేసినప్పుడు పిల్లల్లో ఏదైనా సమస్యలు తలెత్తినట్లైతే తక్షణ వైద్య సాయం అంద చేయాలన్నారు. అనంతరం సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుతూ ప్రజలు తగు జాగ్రతలు తీసుకోవాలని పరిసరాల్లో నీరు వారం రోజుల కన్నా ఎక్కువ నిలువ ఉన్నట్లైతే దోమలు వృద్ది చెoది వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ, మెదడు వాపు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కావున చిన్న గుంతలుంటే పూడ్చి వేయటం, నీరు పారే విధముగా చూడటం, నిలువ ఉన్న నీటిలో కిరోసేన్ లేదా వాడిన ఇంజన్ ఆయిల్లో ముంచిన గుడ్డ ఉండలు (ఆయిల్ బాల్స్ ) వేసినట్లైతే దోమలను లార్వా దశలోనే నిర్మూలించవచ్చన్నారు. దోమలు పుట్టకుండా చూడటమే కాకుండా, కుట్టకుండా కిటికీలకు, డోర్ లకు మేష్ అమర్చడం, ఇతర వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నీరు నిలువ ఉన్న డ్రమ్ములు, పాత్రలు ఖాళీ చేసి ఆర బెట్టటం, పాత టైర్లు, పగిలిన డ్రమ్ములు మొదలైనవి లేకుండా చూడాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతంలో ఆదివారం 10 గంటలకు పది నిమిషాలు డ్రై డే ఆవశ్యకతను వివరించాలన్నారు. రోడ్డు వెంబడి తినుబండరాలు తినకూడదని, వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలని, క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగలని లేదా కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి ఉపయోగించాలని, పైప్ లైన్ల లీకేజీలు గమనించినట్లైతే వెంటనే సంభoధిత సిబ్బంది తెలియచేయాలన్నారు.
బోదకాలు ( ఫైలేరియా ) రాకుండా నివారించేందుకు, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు డి.ఇ.సి. మరియు అల్బెండజోల్ మాత్రల పంపిణీ ( మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ) హనుమకొండ జిల్లాలోని ఐనవోలు, కొండ పర్తి, కడిపికొండ పిహెచ్‌సి ల మరియు బోడగుట్ట యూపిహెచ్‌సి పరిధిలో. ఆగస్టు 10 నుండి సామూహిక మాత్రల పంపిణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో కార్యక్రమం పట్ల అవగాహన కలిగించాలన్నారు. మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారుల సహాయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
. 2 సo. ల పై బడిన వారికి ఒక డి.ఇ.సి. మాత్ర 6 నుండి 14 సo. ల వారికి 2 మాత్రలు అలాగే 15 సo. ల పై బడిన వారికి (3) డి.ఇ.సి. మాత్రలు, ఒక అల్బెండజోల్ మాత్ర అందరికి ఇంటింటికి తిరిగి, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్ లు అందించాలని ప్రత్యేక్షంగా గర్భిణీ స్రీలకు అనారోగ్యంతో ఉన్న వారికి ఇవ్వకూడదన్నారు. ఫైలేరియా ప్రభావిత ప్రాంతాల్లో 5 నుండి 6 సo. ల పాటు ప్రతి యేడాది ఆ ప్రాంతంలోని అందరికీ ఈ మాత్రలు ఇవ్వడం ద్వారా సంక్రమణ నిరోధించగలమన్నారు.
ఆగస్టు 7 నుండి నిర్వహిస్తున్న ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రదనుష్ – 5 లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని, పాక్షికముగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని తెలిపారు. ముఖ్యంగా హై రిస్క్ ఏరియా లైన స్లమ్ ఏరియా లు, ఇటుక బట్టీలు పెట్టె ప్రదేశాలు, సంచార జాతుల వారు, ఎక్కువగా టీకాలను మిస్సవుతున్నారని,ఈ నెల 14 నుండి 20 వరకు ఆరోగ్య సిబ్బంది తమ పరిధిలో సర్వే నిర్వహించి లబ్ధి దారులను గుర్తించాలన్నారు. ఆగస్టు 7 నుండి 12, సెప్టెంబర్ 11 నుండి 16, అక్టోబర్ 9 నుండి 14 తేదీలలో వారములో 6 పని దినాలలో ఈ ప్రత్యేక సెషన్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2023 వరకు మిజిల్స్, రుబెల్లాను దేశం నుండి ప్రారదోలడానికి (ELIMINATION) కు ఉపయోగపడుతుందన్నారు. లెఫ్ట్ ఓవర్, (ఇంత వరకు వ్యాక్సిన్ తీసుకొని వారు ), డ్రాప్ ఔట్స్ ( పాక్షికంగా వేయించున్న వారి జాబితాను తయారు చేసి ఈ ప్రత్యేక సెషన్ లు, రెగ్యులర్గా బుధ వారం, శని వారం నిర్వహించే టీకా సెషన్ లలో వేయించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, జిల్లా పంచాయతీ ఆఫీసర్ జగదీశ్వర్, విద్యాశాఖ అధికారి అబ్దుల్ హాయ్, మునిసిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి. మదన్మోహాన్ రావు, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డాక్టర్. గీతా లక్ష్మి, డిస్టిక్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ, ఎన్‌సిడి అధికారి డాక్టర్ ఉమా శ్రీ,, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి మధురిమ, మెప్మా డి ఎం సి రజిత రాణి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఓటరు జాబితాలో నూతనంగా ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితాపై అన్ని జిల్లా ల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్, 1వ తేది నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న యువత ఆన్లైన్ ద్వారా కానీ ఫారం-6 ద్వారా కానీ దరఖాస్తు చేసుకునేందుకు జూలై ,15 వరకు చివరి తేదిగా ప్రకటించడం జరిగిందన్నారు. జూలై ,15 నాటికి వచ్చిన అన్ని దరఖాస్తులను బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన దరఖాస్తులను జూలై, 27 లోపు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని పొలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు, సరైన వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యంగులకు ర్యాంప్, విద్యుత్ కనెక్షన్ , ఫర్నిచర్ ఉండేవిధంగా చూసుకొని అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు పై యువతకు గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీలో ప్రచారం చేయాలని చెప్పారు. ఈ.వి.యం. ఈ విధంగా పనిచేస్తుంది, వాటి పనితనం పై నియోజక వర్గస్తాయిలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ.వి.యం, వివి ప్యాట్, కంట్రోల్ యూనిట్ల ప్రదర్శన చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మరణించిన ఓటర్లు, డుప్లికేట్ ఓటర్ల తొలగించిన ధరకాస్తుల పరిశీలన జిల్లా మరియు నియోజకవరర్గం వారిగా పూర్తి అయ్యాయని,. కొత్త ఓటర్ల నమోదు కొరకు బి.ఎల్. ఒ ల ద్వారా ఇంటింటి సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒకే ఇంటి నెంబరు పై 6 అంతకన్నా ఎక్కువ ఓట్లు నమోదు అయిన వాటికి బి.ఎల్. ఒ ల ద్వారా ఇంటింటికి తిరిగి సర్వే చేయడం పూర్తి అయిందన్నారు. పొరపాటున డిలీట్ అయిన ఓటర్ల నుండి ఫారం -6 తీసుకోవడం జరుగుతుందన్నారు. జూలై 15 వరకు వచ్చే అన్ని దరఖాస్తులను ఇంటింటి సర్వే చేయించి జూలై 27 లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ సమావేశం లో అడనపు కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ వాసు చంద్ర పర్కాల ఆర్డీఓ రాము తదితరులు పాల్గొన్నారు..
చౌటుప్పల్ మండల ప్రతినిధి /ఉదారి కిషోర్
చౌటుప్పల్ మున్సిపల్ తంగడపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆకిటి గణేష్ గతనాలుగురోజులక్రితంప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే గణేష్ మృతి చెందారు. గణేష్ మిత్రుడు సేవా ట్రస్ట్ సభ్యులు జట్ట లక్ష్మణ్ కెవిఎస్ సేవా ట్రస్ట్ చైర్మన్ కొండమడుగు శ్రవణ్ కుమార్ కి గణేష్ కుటుంబ సభ్యులకు ఏదైనా సాకారం అందించాలని తెలిపారు. విషయం తెలుసుకున్న కొండమడుగు శ్రవణ్ కుమార్ వెంటనే స్పందించారు. శనివారం గణేష్ దశదిన కార్యక్రమం ఉండడంతో ఆ కుటుంబ సభ్యులు తండ్రి సతయ్య కి దాత కౌన్సిలర్ దండహిమబిందు అరుణ్ సహకారంతో కెవిఎస్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కేజీలబియ్యం శుక్రవారం అందజేయడంజరిగినది.
చౌటుప్పల్ మండల ప్రతినిధి / ఉదారి కిషోర్
సంవత్సరంన్నర కాలంగా చౌటుప్పల్ నుండి తంగడపల్లి వెళ్ళే రహదారి నిర్మాణం అసంపూర్తిగా వదిలేసి అలాగే చౌటుప్పల్ సర్వీస్ రోడ్లను యేండ్ల తరబడి పూర్తిచేయకుండా మరియు చౌటుప్పల్ ఊర చెరువు అలుగుకాలువను నిర్మాణం చేయకుండాప్రజల ప్రాణాలతో చెలగాటంఆడుతున్న ఈ ప్రభుత్వ మొండివైఖరికివ్యతిరేఖంగా,ఈసారి BRS ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా పెట్టుకొని చౌటుప్పల్ నడిగడ్డ నుండి RDO ఆఫీస్ వరకు నిరసన చేస్తూ ర్యాలీగా వెళ్లి RDO గారికి వినతి పత్రం అందజేసిన టీపీసీసీ ప్రదాన కార్యదర్శిమరియు మునుగోడునియోజకవర్గం ఇంచార్జి చలమల్ల క్రిష్ణారెడ్డి గారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు
చౌటుప్పల్ మండల ప్రతినిధి /ఉదారి కిషోర్
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దేవలమ్మ నాగారం నుండి శ్రీశ్రీశ్రీ ఆది మహా విష్ణు గుడి నుండి అల్లాపురం రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరు చేయించిన మన మునుగోడు ముద్దుబిడ్డ శాసనసభ్యులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బీటి రోడ్డు 2.5 కిలోమీటర్లు రెండు కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ తారక రామారావు గారికి రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా రోడ్డు మంజూరు చేయించిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి చౌటుప్పల్ మండల అధ్యక్షులు నిరంజన్ గౌడ్ గారికి దేవలమ్మ నాగారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మన గ్రామంలోని మైనారిటీ యాదవ మరియు రెడ్డి కమ్యూనిటీ హాల్స్ కూడా ఒక వారం లోపల ప్రొసీడింగ్స్ ఇస్తానని మరియు ముదిరాజుల పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందిమహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఉత్తరాదిన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. దీంతో శుక్రవారం భద్రాద్రిలో గోదావరి నీటి మట్టం 18.3 అడుగులకు చేరింది. గోదావరి నదికి వరద ఉదృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సాయంత్రానికి వరద ప్రవాహం మరితం పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు...!!_
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
శ్రీహరికోట.జులై 14:అలనాటి రామచంద్రుడి నుంచి నేటి ఆధునిక రోబో వరకు.. అందాల చందమామ ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019 న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.కానీ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయింది. అయితే, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.
తక్కువ ఖర్చుతో కూడుకున్న మిషన్లకు పేరుపొందిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ -3తో మరోసారి చంద్రుడిపైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ నీటి మొత్తాన్ని ఆవిరి రూపంలో ఉన్న ట్రేస్ గుర్తించి చంద్రయాన్ -1తో అపారమైన విజయాన్ని సాధించింది. అందుకే మరోసారి చంద్రయాన్ -3తో చంద్రుని ఉపరితలంపై మరింత అధ్యయనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బిలియన్ సంవత్సరాలలో సూర్యరశ్మిని చూడని చంద్రుని చీకటి వైపు దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మంచు, విస్తారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని పరిశోధకులు నమ్ముతారు. చంద్రుడి నిగూఢ రహస్యాలు ఛేదించడానికి ఇస్రో చేపట్టిన మూడో ప్రయోగం ఇది.
చంద్రయాన్ - 3 ఎందుకు?
ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ..అగ్రదేశాల జాబితాల్లో చేరిపోయింది భారత్. సాంకేతిక పరంగా పరంగా ఎన్నో వినూత్న ప్రయోగాలకు చిరునామా ఇస్రో చిరునామాగా నిలుస్తుంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో భారత్ చేస్తున్న ప్రయోగాలకు అన్ని దేశాలు ఫిదా అవుతున్నాయి. ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ఘనతను సాధించనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని చేరుకోనుంది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపనున్నారు. దీనికోసం ఇస్రో అన్ని ప్రయత్నాలు చేసి, నేడు ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించబోతుంది. ఇది 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇది ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. దీనికోసం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3ని వినియోగించనుంది.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చంద్రయాన్-2 కంటే తక్కువ ఖర్చుతో ప్రయోగిస్తుంది. దీనికి కారణం చంద్రయాన్-2లో పంపిన ఆర్బిటర్ ఇప్పిటికి విజయవంతంగా కక్ష్యలో తిరుగుతూ.. చంద్రుడి ఉపరితలాన్ని చాలా వరకూ స్కాన్ చేసి విలువైన సమాచారాన్ని భూమికి పంపించింది. ఈ ఆర్బిటర్ జీవితకాలం ఏడున్నరేళ్లు అని ఇస్రో నిర్ధారించింది. ఆ ఆర్బిటర్ ఇప్పటికి విజయవంతంగా సేవలు అందించడంతో చంద్రయాన్-3 ప్రయోగంలో ఆర్బిటర్ పంపించడం లేదు. చంద్రయాన్-2లో పంపించిన ఆర్బిటర్‌నే దీనికి ఉపయోగించుకోనున్నారు..
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి. ఈమేరకు సంక్షేమ సొసైటీల పరిధిలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్యస్థితిని తెలియజేసేలా నివేదికలు రూపొందించనున్నారు. ఈ ఆరోగ్య నివేదికల ఆధారంగా విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి.. ఆయా విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. అలాగే దృష్టిలోపం, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వారికి అత్యవసర వైద్యచికిత్సలు అందిస్తారు. అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్‌బీఎస్‌కే) కింద గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తారు. గురుకులాల్లో ప్రవేశాలు మూడో వారానికి పూర్తికానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. గురుకులాల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.*కరోనా తర్వాత తొలిసారిగా...*
గురుకులాల్లో విద్యార్థులకు ఏటా ఏప్రిల్‌లో వైద్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరిస్థితిని సమీక్షించాలి. విద్యార్థుల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సలు అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడేవి. కరోనా వ్యాప్తి తర్వాత విద్యార్థులకు వైద్య పరీక్షలు జరపకపోవడంతో వారి అనారోగ్య సమస్యలు తెలుసుకోవడం కష్టమవుతోంది. కొందరు విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బయటపడకపోవడం, తల్లిదండ్రులు చెప్పకపోవడం ప్రాణాలమీదకు వస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులకు చికిత్స అందించేందుకు ఏర్పాటైన 24 గంటల హెల్ప్‌లైన్ కేంద్రం అవసరమైన వైద్య సలహాలు మాత్రమే ఇస్తోంది. విద్యార్థుల వైద్య నివేదికలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కోసారి సత్వర చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురుకులాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులందరి చదువు, వసతితో పాటు ఆరోగ్యంపై భరోసా ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఆర్‌బీఎస్‌కే బృందాలు గురుకుల పాఠశాలలకు చేరుకుని విద్యార్థులకు వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. రక్తపరీక్షలకు నమూనాలు తీసుకుని టీఎస్ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో పరీక్షించనున్నారు. ఫలితాలను విశ్లేషించి, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు వైద్యచికిత్సలు అవసరమైన విద్యార్థులను సొసైటీలు గుర్తించనున్నాయి. నెల రోజుల్లో వైద్యపరీక్షలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సొసైటీలు.. విద్యార్థుల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలని యోచిస్తున్నాయి.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
హైదరాబాద్: జూలై 14:
తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఈడబ్ల్యూఎ్‌స లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం... దేశంలోని 12 రాష్ట్రాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గోవా, బిహార్ ఉన్నాయి. వీటిలో అసోం, యూపీ, బిహార్‌లలో మాత్రమే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ లభ్యత అత్యల్పంగా ఉంది. భారీ వరదలతో సతమతమవుతున్న హిమాచల్‌ప్రదేశ్‌నూ ఇదే పరిస్థితి. వరద ముప్పు అంత తీవ్రంగా లేని ఉత్తరాఖండ్‌లో ఈ వ్యవస్థల లభ్యత అత్యధికంగా ఉండగా, యమునా నది ఉధృతి కారణంగా వరదలు ముంచెత్తుతున్న ఢిల్లీ ఈ విషయంలో మధ్యస్థంగా ఉంది.
*ముందస్తు సమాచారం కొందరికే*
దేశవ్యాప్తంగా 72శాతం జిల్లాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని సీఈఈడబ్ల్యూ నివేదిక పేర్కొంది. అందులో 25శాతం జిల్లాలు మాత్రమే వరద అంచనా కేంద్రాలు/ ముందస్తు హెచరిక వ్యవస్థలను కలిగి ఉన్నాయని తెలిపింది. అంటే దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు తీవ్ర వరదలతో ప్రభావితం అవుతుండగా, ఒక వంతు మందికి మాత్రమే ముందస్తు సమాచారం అందించే అవకాశం ఉంటోంది. మరోవైపు దేశ జానాభాలో 25శాతం మంది తుఫాన్లు, తదనంతర పరిణామాలతో ప్రభావితమవుతుండగా వారిలో నూరు శాతం మందికీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని నివేదిక వివరించింది. కాగా, ఈడబ్ల్యూఎ్‌సలను విస్తృతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని దేశంలో ఇటీవల సంభవించిన వరదలు మరోసారి స్పష్టం చేశాయని సీఈఈడబ్ల్యూ సీనియర్ ప్రోగ్రాం లీడ్ డాక్టర్ విశ్వాస్ చితాలే అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్రాలు వీటి ఏర్పాటును వేగవంతం చేయాలని ఆయన సూచించారు...
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ పరిధిలో కొనసాగనున్న,కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ,బల్దియా కమిషనర్ రిజ్వాన్ భాషా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా 49వ డివిజన్ లో గల బంధం చెరువు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మించనున్న ల్యాండ్ స్కేప్, లైటింగ్, వాక్ వే పనులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్.టి.పి.యందు పర్యటించి దెబ్బతిన్న రోడ్ లను పునరుద్ధరించాలని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు.
గాంధీ నగర్ లో ఇటీవల ఏర్పాటు చేసిన నమూనా వైకుంఠ ధామాన్ని పరిశీలించారు.
అనంతరం తులసి బార్ ప్రాంతం లో నిర్మిస్తున్న డక్ట్ పనులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న 4% పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ లు మానస రామ్ ప్రసాద్, సిరంగి సునీల్ కుమార్, బల్దియా ఎస్. ఈ. ప్రవీణ్ చంద్ర, సి.ఎం.హెచ్. ఓ.డా.రాజేష్,సి.హెచ్. ఓ.శ్రీనివాస రావు, ఈ.ఈ.రాజయ్య,ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాకు కేటాయించబడిన ఆయిల్ పాం కంపెనీ అయినటువంటి కే.ఎన్ బయో సైన్సెస్ వారి నర్సరీ ని సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం, రైతుల వివరాలు, రాయితీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నర్సరీలను తిమ్మాపూర్ లో 10 ఎకరాలలో, సెంట్రల్ జైలు ఆవరణలో 21 ఎకరాలలో నిర్వహిస్తున్నారని తెలిపారు. నర్సరీలలో మొక్కలను పెంచడానికి అవసరమైన విత్తనాలను కోస్టారికా, ఇండోనేషియా నుండి దిగుమతి చేయడం జరుగుతుందని, దిగుమతి చేసిన విత్తనాలను మొదట షేడ్ నెట్ కింద నాలుగు నెలలు పెంచి, ఆ తర్వాత నాలుగు నెలల వయసున్న మొక్కలను బయట సెకండరీ నర్సరీలో 8 నెలలు పించి, ఆ ఎదిగిన మొక్కలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తారనీ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు నర్సరీలో కలిపి 3 లక్షల 75 వేల మొక్కలు పెంచుతున్నారనీ అన్నారు.
రైతులకు ఒక ఎకరానికి మొక్కలపై రాయితీ రూ.11000, తోట యజమాన్యం ఎరువులకు రూ. 2100, అంతర పంటలకు రూ. 2100, బిందు సేద్యం ఎకరమునకు 15,000 నుండి 16,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆపై రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు ఎకరానికి 4,200 చొప్పున రాయితీ ఇస్తారనీ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లా లక్ష్యం 5900 ఎకరాలు. (ఇందులో కేఎన్ బయో సైన్సెస్ వారి లక్ష్యం 3500 ఎకరాలు, రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వారి లక్ష్యం 2400 ఎకరాలు)
ఇప్పటివరకు 630 ఎకరాలు మంజూరు చేసి, రైతులకు మొక్కలు సరఫరా చేయగ రైతులు మొక్కలు నాటుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్శనలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి ఆర్ శ్రీనివాస్ రావు, ఉద్యానవన అధికారులు, ఎస్. శంకర్, బి. మానస, కే.ఎన్ బయో సైన్సెస్ కంపెనీ ప్రతినిధులు పివి కుశాల్ రెడ్డి, నర్సరీ యజమానులు, సెంట్రల్ జైలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణ పనులను గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ ను , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా జిల్లా డిపిఓ ఆఫీస్ పూర్తి చేయాలని, నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జిల్లా పోలీస్ కార్యాలయం తో పాటు కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ ను ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి వెంట కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, అదనపు ఎస్పీ ఏ.ఆర్ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, మున్సిపల్ చైర్మన్ సెగ్గo వెంకట్రాణి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
చర్ల. జులై 10 :
మావోయిస్టుల పేరుతో నగదు వసూలు చేస్తున్న నలుగురిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సీఐ బి.అశోక్, ఎస్సైలు టీవీఆర్ సూరి, టి. వెంకటప్పయ్యలు మీడియాకి వివరాలు తెలిపారు. చర్ల మండలం, గన్నవరం గ్రామానికి చెందిన శ్యామల రామకృష్ణ (31), చిన్నమిడిసిలేరుకి చెందిన శ్యామల జలేందర్ (23), శ్యామల నవీన్ (21), సి.కొత్తూరుకి చెందిన తెల్లం సంతోష్ (22) అనువారు మావోయిస్టుల పేరు చెబుతూ నకిలీ తుపాకితో వ్యాపారులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుండగా పట్టుకున్నారు.
అనంతరం వారి వద్ద నుంచి రూ 2370 నగదును, నకిలీ తుపాకి స్వాధీనం చేసుకుని, వీరిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల బెదిరింపులకు భయపడి వ్యాపారులు డబ్బులు ఇవ్వరాదని, ఇలాంటి వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.....
మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించి దీక్ష చేపట్టిన BSP పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్. ఈ సందర్భంగా *గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంతర్గాం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ సిబ్బంది చేస్తున్న పోరాటానికి బీఎస్పీ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, గ్రామ పంచాయతీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి కనీస వేతనం ₹.19,500/- అమలు చేయాలని, వారికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని" అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ అంతర్గాం మండల నాయకులు చిలుక రాంమూర్తి, ఏ.రాజేందర్, మహ్మద్ పాషా, బీ.శ్రీనివాస్ లతో పాటు అంతర్గాం మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ అధ్యక్షులు తూడూరి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి మాలెం సురేష్, కొండ కరుణాకర్ రావు, తమ్మనవేని శంకర్, రాపోలు విద్యాకర్ రావు, తిగుట్ల దేవరా, కండె మొండయ్య, ఉప్పులేటి మధుకర్, కాంపెల్లి శంకర్, కొల్లూరి మల్లేష్, చిలుక మల్లయ్య, ఉప్పులేటి హనుమంతు లతో పాటు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ మేడిపల్లి గ్రామంలో ఎన్టిపిసి పట్టణ రజక సేవా సంఘం ప్రెసిడెంట్ పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు, మడేలేశ్వర స్వామి బోనాల ను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మేడిపల్లి గ్రామ రజక సంఘం,కుల బాంధవులు మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయానికి బయలుదేరి పోచమ్మ తల్లికి మడేలేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ శారద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టిపిసి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసాల శ్రీనివాస్, నస్కూరి భూమయ్య, నస్పూరి శ్రీనివాస్, నస్పూరి సంతోష్, కొత్తకొండ లక్ష్మణ్, దొడ్డిపట్ల బాపన్న, పూసాల సత్యనారాయణ, పెనుగొండ సత్తయ్య, దురుశెట్టి కిష్టయ్య, జనగామ శంకర్, పారుపెల్లి రాజయ్య, పారుపెల్లి వెంకటేష్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ నాయకులు మక్కాన్ సింగ్ ఆరోపణలు చేస్తున్నారని రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, జేవి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి..ఎమ్మెల్యే చందర్ నేతృత్వంలో కేవలం నాలుగున్నర ఏండ్లలో జరగడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. చందర్ పై ప్రజల్లో నానాటికి పెరుగుతున్న అభిమానాన్ని తట్టుకోలేక, ఓటమి భయంతోనే మక్కాన్ సింగ్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ప్రజల దశాబ్దాల చిరకాలవాంఛ అయిన మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టు భవన సదుపాయంతోపాటుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చందర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఏర్పాటు కావలసిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి, మెప్పించి నియోజకవర్గంలో ఏర్పాటయ్యేలా ఎమ్మెల్యే చందర్ కృషి చేశారన్నారు. స్థానిక యువత ఉపాధి కోసం తనవంతుబాధ్యతగా ఎమ్మెల్యే చందర్ అమెరికాకు వెళ్లి, అక్కడి ఐటి పారిశ్రామికవేత్తలతో సమావేశమై సానుకూల స్పందనను తీసుకువచ్చారని అన్నారు. మొక్కవోని పట్టుదలతో నియోజవర్గానికి మెడికల్ కళాశాల తీసుకువస్తే కాంగ్రెస్ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారేతప్ప..ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేయకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ తీసుకువస్తే.. ఇరవై తేలేదు..అరవై తెలీదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. నియోజకవర్గంలో కళ్ళ ముందే ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే.. ఏమి జరగలేదు అనడం వారిలో దాగి ఉన్న కుట్రను బట్టబయలు చేస్తుందన్నారు. సింగరేణి స్థలాల్లో ఉన్న నివాసితులకు త్వరలోనే పట్టాలు అందించే విధంగా ఎమ్మెల్యే చందర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలతోనే మమేకమై.. ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే చందర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రజాప్రతినిధులు చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే చేయడంతో ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా ఎదగడం కాదని.. ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయ పడడమని.. అందుకు నిదర్శనం ఎమ్మెల్యే చందర్ రని వారు అన్నారు. ఎమ్మెల్యే చందర్ పై అనవసర ఆరోపణలు చేస్తే రాబోయేకాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో రామగుండం కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్ వంగ శ్రీనివాస్ గౌడ్, బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, అడ్డాల రామస్వామి, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జావిద్ పాషా, చెలుకలపల్లి శ్రీనివాస్, గుంపుల ఓదెలు యాదవ్, మేడి సదానందం, నీరటి శ్రీనివాస్, మండ రమేష్, అచ్చ వేణు, కలువల సంజీవ్,పిల్లి రమేష్, కాంపెల్లి సతీష్, దాసరి ఎల్లయ్య, అక్షర మల్లేష్, అదర్ సండే సమ్మా రావు తదితరులు పాల్గొన్నారు.
మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పుష్పాలతో నమస్కారం చేయడం జరిగింది....ఆగస్ట్ 20న చలో ఇందిర పార్క్ -హైదరాబాద్ కు తరలి రావాలని..... తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు యొక్క పోస్టర్లను టి యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, టి యు ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో .... కలిసి ఆవిష్కరించిన ఉత్తర తెలంగాణ కన్వీనర్ , జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్...
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యమ రథసారథి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.....
తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశామని ఆగస్ట్ 20న జరిగే ఉద్యమకారుల సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి ఉద్యమకారుడు హాజరుకావాలని కోరారు...
ఆనాడు ఉమ్మడి రామగుండం మండలం లో తెలంగాణ రాష్ట్రం కోసం బస్, లారీలు, కాలబెట్టడం ,ఐవోసి పైన దాడి చేశాం .... మా మీద నాన్- బెలబుల్ కేసులు పెట్టడం జరిగింది...రామగుండం పట్టణం లో మరియు గోదావరిఖని చౌరస్తా గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చేశామని తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నీలిచామని మళ్లీ నేడు రాష్ట్రం కోసం కష్టపడ్డ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి... ఉద్యమానికి నాంది పలుకుతున్నామని తెలిపారు...
తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ ప్రతి ఉద్యమకారుడు ఏ పార్టీలో ఉన్న తగిన ప్రాధాన్యత , గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు...
రానున్న రోజుల్లో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఉద్యమకారుల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని ఉద్యమకారులు డిమాండ్ చేశారు....
ఈ కార్యక్రమంలో టి యు ఎఫ్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, ఉద్యమ కారులు నూనె రాజేశం, తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు....గొర్రె రమేష్ ,నూనె కొమురయ్య , అక్కపాక లక్ష్మి, టి యు ఎఫ్ అంతర్గాం మండల ఉద్యమ కారులు అంగోత్ శంకర్, గోసిక తిరుపతి, అలకుంట సంపత్, వేముల రాజ్ కుమార్, బానోతు సురేష్, మామిడి రవీందర్, తదితరులు పాల్గొన్నారు...
మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం అంతరాష్ట్ర బ్రిడ్జి సమీపంలో బైకును లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై ఇద్దరు యువకులు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో పిట్టల శేఖర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ యువకుడిని హుటాహుటిన మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం కు రెఫర్ చేశారు..
మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
భూపాలపల్లి: అంబేద్కర్ సెంటర్ ప్రధాన కూడలి జాతీయ రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాహనదారులు ప్రయాణం చేయడం చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అలాగే బాంబుల గడ్డ నుండి ఫైంట్ లైన్ కమాన్ వరకు, ఒకవైపు రహదారి మొత్తం గాఢాలు కాలువగా ఉండడం వలన మోటార్ సైకిల్, కారు లాంటి వాహనాలు అదుపుతప్పి పడి అంగవైకల్యానికి లేదా ప్రాణా ప్రాయ పరిస్థితులు జరిగే అవకాశాలు ఉన్నాయి.కావున ఆర్&బి వారు వెంటనే ఈ ఒక్క రోడ్డు మరమ్మత్తులు త్వరగా చేయాలని, ఇప్పుడు వర్షాకాలం కావున గుంతలలో నీళ్లు నిండడం వల్ల వాహనదారులు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, వెంటనే మరమ్మత్తులు ప్రారంభించాలని తీన్మార్ మల్లన్న 7200 టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు.అలాగే ప్రధాన కూడలిలో సిగ్నల్ లైటింగ్ సిస్టం పనిచేయకపోవడం వలన వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్లడం వలన ఇతరులకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, కావున సిగ్నల్ లైటింగ్ రిపేర్ లేకుండా వెంటనే పునరుద్ధరించాలని రవి పటేల్ కోరారు.ఇందులో జిల్లా కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.
మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని జంగాలపల్లి ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గత నాలుగు నెలలుగా పోరాటం చేస్తూ గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదల యొక్క గుడిసెలను శనివారం రోజు వేకువజావున బ్లేడు ట్రాక్టర్లు పెట్టి రెవెన్యూ యంత్రాంగం గుడిసెలను తొలగించటాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా తొలగించిన గుడిసెలను సందర్శిస్తూ,గుడిసె బాధితులను ఓదారుస్తూ ధైర్యంగా ఉండండి తప్పకుండా ఇంటి స్థలాలు సాధించుకునేదాకా పోరాటం విరమించేది లేదని అన్నారు. ఇదే జంగాలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములలో అక్రమంగా పెంచింగ్ వేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే రెవెన్యూ యంత్రంగానికి ఆ కబ్జాదారులు కంటికి కనబడతలేరా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకొని దర్జాగా ఉంటుంటే వారి పైన ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావటం లేదన్నారు. నిలువ నీడ కోసం పేదవాడు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే మాత్రం అధికారులకు ఎందుకు ఇంత నిరంతృషత్వంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇంకో వైపు 03వ డివిజన్ ప్రాంతానికి చెందిన వెంకటేష్, 05వ డివిజన్ ప్రాంతానికి చెందిన శశి, కృష్ణలు నిలువ నీడ లేని వారి కోసం సీపీఎం పార్టీ చేస్తున్న భూ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వకపోగా వీరు చేసే రియల్ ఎస్టేట్ భూ దందా వ్యాపార ఆలోచనలతో ఇక్కడ స్థానిక మూడో డివిజన్ ఐదో డివిజన్ ప్రజలను వారి తప్పుడు ఆలోచనలు మాటలతో తప్పుదోవ పట్టిస్తూ ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పక చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు గుడిసెలు తొలగించినంత మాత్రాన భూ పోరాటం ఆగదని తొలగించిన స్థలంలోని మళ్లీ గుడిసెలు వేసుకొని పోరాటం కొనసాగిస్తామని ఎన్ని సార్లు తీసేస్తే అన్ని సార్లు వేస్తామని ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని రెవెన్యూ అధికారులను స్థానికంగా రియల్ ఎస్టేట్ పేరుతో భూ దందాలు చేసే వారిని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మహేశ్వరి, మూడవ భూ పోరాట కేంద్ర కన్వీనర్ బిక్షపతి మరియు నాయకులు కృష్ణ, సురేష్, లక్ష్మణ్ నాగరాజు, శంకర్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు