ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లాలో  సీజనల్ వ్యాధులను నియంత్రించడంలో సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు.శుక్రవారం  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, డి వార్మింగ్ డే, మిషన్ ఇంద్రధనస్సు, ఫైలేరియా మాత్రల పంపిణీ కార్యక్రమాల పైన నిర్వహించిన జిల్లా స్థాయి  సమన్మయ సమావేశంలో మాట్లాడుతూ వైద్యశాఖ, మున్సిపల్, ఐసిడిఎస్, విద్యాశాఖ, డి ఆర్ డి ఓ, మెప్మా తదితరులు నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు.   జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం  సందర్భంగా ఈ నెల 20 న ఏడాది వయసు నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలు అందించాలని సంబoదిత  అధికారులకు సూచించారు. నులి పురుగుల కారణoగా రక్త హీనత, ఎదుగుదల లోపించడం తదితర సమస్యలు ఎదురవుతాయన్నారు. మండల, గ్రామ స్థాయి లోని సమన్వయ కమిటీ ల ద్వారా నులి పురుగుల నివారణ లై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న                మంది పిల్లలకు మాత్రలు అంద చేయాలన్నారు. మాత్రలు వేసినప్పుడు పిల్లల్లో ఏదైనా సమస్యలు తలెత్తినట్లైతే తక్షణ వైద్య సాయం అంద చేయాలన్నారు. అనంతరం సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుతూ ప్రజలు తగు జాగ్రతలు తీసుకోవాలని పరిసరాల్లో నీరు వారం రోజుల కన్నా ఎక్కువ నిలువ ఉన్నట్లైతే దోమలు వృద్ది చెoది వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ, మెదడు వాపు వంటి వ్యాధులు  ప్రబలే అవకాశం ఉందని కావున చిన్న గుంతలుంటే పూడ్చి వేయటం, నీరు పారే విధముగా చూడటం, నిలువ ఉన్న నీటిలో కిరోసేన్ లేదా వాడిన ఇంజన్ ఆయిల్లో ముంచిన  గుడ్డ ఉండలు (ఆయిల్ బాల్స్ ) వేసినట్లైతే దోమలను లార్వా దశలోనే నిర్మూలించవచ్చన్నారు. దోమలు పుట్టకుండా చూడటమే కాకుండా, కుట్టకుండా కిటికీలకు, డోర్ లకు మేష్ అమర్చడం, ఇతర వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నీరు నిలువ ఉన్న డ్రమ్ములు, పాత్రలు ఖాళీ చేసి ఆర బెట్టటం, పాత టైర్లు, పగిలిన డ్రమ్ములు మొదలైనవి లేకుండా చూడాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతంలో ఆదివారం 10 గంటలకు పది నిమిషాలు డ్రై డే ఆవశ్యకతను వివరించాలన్నారు. రోడ్డు వెంబడి తినుబండరాలు తినకూడదని, వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలని, క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగలని లేదా కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి ఉపయోగించాలని, పైప్ లైన్ల లీకేజీలు గమనించినట్లైతే వెంటనే సంభoధిత సిబ్బంది తెలియచేయాలన్నారు.                                                           

              బోదకాలు ( ఫైలేరియా ) రాకుండా నివారించేందుకు, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు డి.ఇ.సి. మరియు అల్బెండజోల్ మాత్రల పంపిణీ ( మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ )  హనుమకొండ జిల్లాలోని ఐనవోలు, కొండ పర్తి, కడిపికొండ పి‌హెచ్‌సి ల మరియు బోడగుట్ట యూ‌పి‌హెచ్‌సి పరిధిలో.  ఆగస్టు 10 నుండి సామూహిక మాత్రల పంపిణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో కార్యక్రమం పట్ల అవగాహన కలిగించాలన్నారు.  మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారుల సహాయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 

. 2 సo. ల పై బడిన వారికి ఒక  డి.ఇ.సి. మాత్ర 6 నుండి 14 సo. ల వారికి 2 మాత్రలు అలాగే 15  సo. ల పై బడిన వారికి (3) డి.ఇ.సి. మాత్రలు, ఒక అల్బెండజోల్ మాత్ర అందరికి ఇంటింటికి తిరిగి, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్ లు అందించాలని ప్రత్యేక్షంగా గర్భిణీ స్రీలకు అనారోగ్యంతో ఉన్న వారికి ఇవ్వకూడదన్నారు. ఫైలేరియా ప్రభావిత ప్రాంతాల్లో 5 నుండి 6 సo. ల పాటు ప్రతి యేడాది ఆ ప్రాంతంలోని అందరికీ ఈ మాత్రలు ఇవ్వడం ద్వారా సంక్రమణ నిరోధించగలమన్నారు.    

         ఆగస్టు 7 నుండి నిర్వహిస్తున్న ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రదనుష్ – 5 లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని, పాక్షికముగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని  తెలిపారు.   ముఖ్యంగా హై రిస్క్ ఏరియా లైన స్లమ్ ఏరియా లు, ఇటుక బట్టీలు పెట్టె ప్రదేశాలు, సంచార జాతుల వారు, ఎక్కువగా టీకాలను మిస్సవుతున్నారని,ఈ నెల 14 నుండి 20 వరకు ఆరోగ్య సిబ్బంది తమ పరిధిలో సర్వే నిర్వహించి లబ్ధి దారులను గుర్తించాలన్నారు. ఆగస్టు 7 నుండి 12, సెప్టెంబర్ 11 నుండి 16, అక్టోబర్ 9 నుండి 14 తేదీలలో వారములో 6 పని దినాలలో ఈ ప్రత్యేక సెషన్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు.   డిసెంబర్ 2023 వరకు మిజిల్స్, రుబెల్లాను దేశం నుండి ప్రారదోలడానికి (ELIMINATION) కు ఉపయోగపడుతుందన్నారు. లెఫ్ట్ ఓవర్,  (ఇంత వరకు వ్యాక్సిన్ తీసుకొని వారు ), డ్రాప్ ఔట్స్ ( పాక్షికంగా వేయించున్న వారి జాబితాను తయారు చేసి ఈ ప్రత్యేక సెషన్ లు, రెగ్యులర్గా బుధ వారం, శని వారం నిర్వహించే టీకా సెషన్ లలో వేయించాలన్నారు.                 

 ఈ సమావేశంలో  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, జిల్లా పంచాయతీ ఆఫీసర్ జగదీశ్వర్, విద్యాశాఖ అధికారి అబ్దుల్ హాయ్, మునిసిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి. మదన్మోహాన్ రావు, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డాక్టర్. గీతా లక్ష్మి, డిస్టిక్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ, ఎన్‌సి‌డి అధికారి డాక్టర్ ఉమా శ్రీ,, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి మధురిమ, మెప్మా డి ఎం సి రజిత రాణి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: