జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఒక మహిళపై గొడ్డలితో దాడి జరగడం కలకలం రేపింది. హైటెక్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు గుంటల భూమికి సంబంధించిన వివాదంలో హత్యకు గురైన వ్యక్తి కుమారుడు నిందితురాలిపై దాడి చేశాడు.
కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లచ్చక్క (42) అనే మహిళ, మారుపాక సారయ్యను హత్య చేసిన కేసులో నిందితురాలు. ఆమెను అరెస్టు చేయగా, కొద్ది రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది.
ఆ విధంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న లచ్చక్కపై అంజి అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో లచ్చక్కకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దేవరాంపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 14న సారయ్యను లచ్చక్కతో పాటు మరో ముగ్గురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు గురైన సారయ్య కుమారుడు అంజి, తల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశాడు. సరైన సమయం కోసం వేచి చూసి, మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటే లచ్చక్కపై దాడి చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: