ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఓటరు జాబితాలో నూతనంగా ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితాపై అన్ని జిల్లా ల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్, 1వ తేది నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న యువత ఆన్లైన్ ద్వారా కానీ ఫారం-6 ద్వారా కానీ దరఖాస్తు చేసుకునేందుకు జూలై ,15 వరకు చివరి తేదిగా ప్రకటించడం జరిగిందన్నారు. జూలై ,15 నాటికి వచ్చిన అన్ని దరఖాస్తులను బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన దరఖాస్తులను జూలై, 27 లోపు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని పొలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు, సరైన వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యంగులకు ర్యాంప్, విద్యుత్ కనెక్షన్ , ఫర్నిచర్ ఉండేవిధంగా చూసుకొని అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు పై యువతకు గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీలో ప్రచారం చేయాలని చెప్పారు. ఈ.వి.యం. ఈ విధంగా పనిచేస్తుంది, వాటి పనితనం పై నియోజక వర్గస్తాయిలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ.వి.యం, వివి ప్యాట్, కంట్రోల్ యూనిట్ల ప్రదర్శన చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మరణించిన ఓటర్లు, డుప్లికేట్ ఓటర్ల తొలగించిన ధరకాస్తుల పరిశీలన జిల్లా మరియు నియోజకవరర్గం వారిగా పూర్తి అయ్యాయని,. కొత్త ఓటర్ల నమోదు కొరకు బి.ఎల్. ఒ ల ద్వారా ఇంటింటి సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒకే ఇంటి నెంబరు పై 6 అంతకన్నా ఎక్కువ ఓట్లు నమోదు అయిన వాటికి బి.ఎల్. ఒ ల ద్వారా ఇంటింటికి తిరిగి సర్వే చేయడం పూర్తి అయిందన్నారు. పొరపాటున డిలీట్ అయిన ఓటర్ల నుండి ఫారం -6 తీసుకోవడం జరుగుతుందన్నారు. జూలై 15 వరకు వచ్చే అన్ని దరఖాస్తులను ఇంటింటి సర్వే చేయించి జూలై 27 లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ సమావేశం లో అడనపు కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ వాసు చంద్ర పర్కాల ఆర్డీఓ రాము తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: