మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలకు శాపంగా మారిందని, ఎడతేరిపి  లేకుండా కురిసిన అతిభారీ వర్షాల వలన అన్నారం సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో అన్నారం, చండ్రుపెల్లి, నాగపెల్లి, మద్దుల పెల్లి, పల్గుల, కుంట్లం, పుస్కుపెల్లి, కాళేశ్వరం పంటలు గత మూడు సంవత్సరాలనుండి, ఐదు సార్లు యధావిధిగా మునిగిపోయాయిన, ఇప్పటికి ఒక్క ఎకరానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం ఇవ్వ లేదని, రైతులు అప్పులు తెచ్చి ప్రతి సంవత్సరం పెట్టుబడులు పెట్టి తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంత మంది వారి గ్రామాలను వదిలేసి సహజీవనం కోసం పట్టణాలకు వలస వెళ్లారు. గత సంవత్సరం భారీ వర్షాలకు నీటమునిగిన ఇండ్లకు కొంతమందికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు.అయ్యా సీఎం దొర, గత సంవత్సరం పక్క దేశాలవారు గోదావరి పరివాహక ప్రాంతాలపై క్లౌడ్ బరస్ట్ చేసారని చెప్పితివి. మళ్ళీ ఇది వారి కుట్రనేనా.. ఈ గోదావరి పరివాహక ప్రాంతలలో ఉండే రైతులు వారికీ ఏమి అన్యాయం చేసారయ, రైతులుగా పుట్టడం వారు చేసిన పాపమా శాపమా.?రైతుని రాజుని చేస్తా అంటివి, ఐదు సార్లు వాళ్ళ పంటలు మునిగిన పట్టించుకోకపోతివి. మీ ప్రభుత్వానికి రైతు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు దొర. ఇప్పటికైనా మునిగిపోయిన పంట చేనులు, పొలాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంజాయ్ మెంట్ సర్వే చేపించి, ఎకరానికి 30,000వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, ఈ భూములకు శాస్వత పరిస్కారం చేసి ఎకరానికి 30,0000లక్షల చొప్పున ఇచ్చి కే, రా ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్సీ సెల్ మహాదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కొండగొర్ల సంతోష్ డిమాండ్ చేసారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: