ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జయశంకర్  భూపాలపల్లి జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  బుధవారం  తెలిపారు. జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యాత్రగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, జిల్లా పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే నిమిషాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పి పేర్కొన్నారు.

మానేరు, గోదావరి  పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెల్లద్దు అని అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని ఎస్పి  సూచించారు.

గ్రామాలలో పాత ఇండ్లు, గుడిసే లలో,శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు.

జిల్లాలో ఎక్కడైనా వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు  ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఎస్పీ  పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఇతర శాఖ ల అధికారులతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షం మరియు బలమైన గాలుల సమయంలో విద్యుత్ తీగలు, స్తంబాలు మరియు ట్రాన్స్ఫార్మర్లకు  దూరంగా ఉండాలని, అలాగే తడి చేతులతో స్విచ్ బోర్డులు ముట్టకోవద్దని పేర్కొన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని ఎస్పి కరుణాకర్  సూచించారు. 

ప్రజలందరూ ఈ భారీ వర్షాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: