మహాదేవపురం మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీగా, బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని తెలిపింది. బుధవారం లోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా. మరోవైపు ఝార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి.
Post A Comment: