చౌటుప్పల్ మండల ప్రతినిధి /ఉదారి కిషోర్
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దేవలమ్మ నాగారం నుండి శ్రీశ్రీశ్రీ ఆది మహా విష్ణు గుడి నుండి అల్లాపురం రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరు చేయించిన మన మునుగోడు ముద్దుబిడ్డ శాసనసభ్యులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బీటి రోడ్డు 2.5 కిలోమీటర్లు రెండు కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ తారక రామారావు గారికి రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా రోడ్డు మంజూరు చేయించిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి చౌటుప్పల్ మండల అధ్యక్షులు నిరంజన్ గౌడ్ గారికి దేవలమ్మ నాగారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మన గ్రామంలోని మైనారిటీ యాదవ మరియు రెడ్డి కమ్యూనిటీ హాల్స్ కూడా ఒక వారం లోపల ప్రొసీడింగ్స్ ఇస్తానని మరియు ముదిరాజుల పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది
Post A Comment: