మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని జంగాలపల్లి ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గత నాలుగు నెలలుగా పోరాటం చేస్తూ గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదల యొక్క గుడిసెలను శనివారం రోజు వేకువజావున బ్లేడు ట్రాక్టర్లు పెట్టి రెవెన్యూ యంత్రాంగం గుడిసెలను తొలగించటాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


ఈ సందర్భంగా తొలగించిన గుడిసెలను సందర్శిస్తూ,గుడిసె బాధితులను ఓదారుస్తూ ధైర్యంగా ఉండండి తప్పకుండా ఇంటి స్థలాలు సాధించుకునేదాకా పోరాటం విరమించేది లేదని అన్నారు. ఇదే జంగాలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములలో అక్రమంగా పెంచింగ్ వేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే రెవెన్యూ యంత్రంగానికి ఆ కబ్జాదారులు కంటికి కనబడతలేరా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకొని దర్జాగా ఉంటుంటే వారి పైన ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావటం లేదన్నారు.  నిలువ నీడ కోసం పేదవాడు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే మాత్రం అధికారులకు ఎందుకు ఇంత నిరంతృషత్వంగా  వ్యవహరిస్తున్నారో  అర్థం కావటం లేదని  పేద ప్రజలను  తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే  రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇంకో వైపు 03వ డివిజన్ ప్రాంతానికి చెందిన వెంకటేష్, 05వ డివిజన్ ప్రాంతానికి చెందిన శశి, కృష్ణలు  నిలువ నీడ లేని వారి కోసం సీపీఎం పార్టీ చేస్తున్న భూ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వకపోగా వీరు చేసే రియల్ ఎస్టేట్ భూ దందా వ్యాపార ఆలోచనలతో ఇక్కడ స్థానిక మూడో డివిజన్ ఐదో డివిజన్ ప్రజలను వారి తప్పుడు ఆలోచనలు మాటలతో తప్పుదోవ పట్టిస్తూ ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పక చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు గుడిసెలు తొలగించినంత మాత్రాన  భూ పోరాటం ఆగదని తొలగించిన స్థలంలోని మళ్లీ గుడిసెలు వేసుకొని పోరాటం కొనసాగిస్తామని ఎన్ని సార్లు తీసేస్తే అన్ని సార్లు వేస్తామని ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని రెవెన్యూ అధికారులను స్థానికంగా రియల్ ఎస్టేట్ పేరుతో భూ దందాలు చేసే వారిని  ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మహేశ్వరి, మూడవ భూ పోరాట కేంద్ర కన్వీనర్ బిక్షపతి మరియు నాయకులు కృష్ణ, సురేష్, లక్ష్మణ్ నాగరాజు, శంకర్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: