మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఎన్టీపిసి, రామగుండం ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసి వందల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపిసి, ఆర్ఎఫ్ సిఎల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. వందలాది మంది అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కొనసాగుతున్నాయన్నారు. అధికారపార్టీ నేతలు కుంభకోణంలో ఉండడం ప్రజల దౌర్భాగ్యమన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచాలని ధర్నాలు చేసిన పాలకులు పట్టించుకోవడం లేదు. టిఎస్పీఎస్సీ పరీక్షల పేపర్లు లీకేజీ చేసి వందల కోట్లకు అమ్ముకున్న ముఖ్యమంత్రి కార్యాలయం దొంగలే సింగరేణిలో ఉద్యోగాల ప్రకటన విడుదల చేసి, ప్రశ్నాపత్రాలను లీక్ చేశారన్నారు. అధికారపార్టీ నేతల అనుచరులకు పేపర్లు లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య,వైద్యం ఉచితంగా అందజేస్తామన్న ఆయన ప్రతి కుటుంబం నుండి విదేశాల్లో చదివేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.ఇళ్ళు లేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి, భూములేని నిరుపేదలకు ఎకరం భూమిని పంచి మహిళల పేరున పట్టాచేసే ఏకైక పార్టీ బీఎస్పీనేనన్నారు.

Post A Comment: