ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరంగల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 8 శనివారం కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గౌరవ ప్రధాన మంత్రి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇతర ముఖ్యమైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ జైరాం గడ్కరీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, గౌరవ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్ మరియు రైల్వే శాఖలోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ. 6100 .కోట్ల విలువైన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం ఎల్లప్పుడూ గొప్పదని గౌరవ ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపు దిద్దుకోవడ ములో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర అని అన్నారు. దేశ చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని చూస్తున్నామని, దేశ పురోగతిలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గత తొమ్మిదేళ్లలో భారత ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన అనుసంధానo పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

 అనేక సంవత్సరాలుగా వేలాది ఆధునిక కోచ్‌లు మరియు లోకోమోటివ్‌ల ఉత్పత్తితో భారతీయ రైల్వేలు తయారీ రంగంలో నూతన శిఖరాలకు చేరుకుంటుందని గౌరవప్రధాన మంత్రి తెలిపారు. భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా ఇప్పుడు కాజీపేట కూడా గర్వించదగిన భాగస్వామిగా మారిందని ఆయన తెలిపారు .కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నిర్మించడం వల్ల నూతనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తయారీ యూనిట్ నెలకు దాదాపు 200 వ్యాగన్‌లను ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా తన ప్రసంగాన్ని ముగిస్తూ, తెలంగాణను అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ భారత ప్రభుత్వం ‘సబ్కా సాథ్, సబ్‌కా వికాస్’ కుడా ఇదే విధానమని ప్రధాని వివరించారు .

 ఈ సందర్బంగా సభను ఉద్దేశించి, గౌరవ కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ మాట్లాడుతూ, ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గతి శక్తి పథకంలో భాగంగా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక నుండి అమలు వరకు ప్రతి దశను సరైన రీతిలో చట్టబద్దంగా , సమన్వయం మరియు కమ్యూనికేషన్‌తో చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఫలితంగా ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయని, నేడు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారి అనుసంధానం 5,000 కిలోమీటర్లకు చేరుకుందని చెప్పారు.

 గౌరవ ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతదేశంలో రోడ్డు మరియు రైల్వే రవాణా రంగాలు సంవత్సరాలుగా పెద్ద అభివృద్ధిని సాధించాయని గౌరవ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైలు అభివృద్ధి ప్రాజెక్టులపై మాట్లాడుతూ,కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టును సుమారు 160 ఎకరాల్లో రూ.521 కోట్లతో చేపట్ట బడుతుందని మరియు సంవత్సరానికి 2400 వ్యాగన్లను తయారు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. దీంతోపాటు రైల్వేశాఖ హైదరాబాద్‌-యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును రూ. 350 కోట్లుతో మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయ ప్రామాణిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

రైల్వే తయారీ యూనిట్, కాజీపేట యొక్క విశిష్ట లక్షణాలు:

• మొదట్లో, నెలకు 200 వ్యాగన్‌ల పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ ( పి ఓ హెచ్ ) చేపట్టేందుకు కాజీపేటలో వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ మంజూరు చేయబడింది. ప్రాజెక్ట్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ( ఆర్ వి ఎం ఎల్ ) కి అప్పగించబడింది.

• తరువాత, రైల్వేల ద్వారా వ్యాగన్ల అవసరం పెరగడం, స్థానిక పరిశ్రమను ప్రోత్సహించడానికి మరియు ఉపాధి కల్పన అవకాశాలను మరియు ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనే రాజకీయ నాయకుల నుండి తరచుగా వచ్చిన డిమాండ్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కాజీపేటలోని 'వ్యాగన్ రిపేర్ షాప్' ను సుమారు రూ.521 కోట్లు అంచనా వ్యయంతో 'రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్'గా అప్‌గ్రేడ్ చేయబడుతోంది. .

• కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ మొదటి సంవత్సరంలో 1200 వ్యాగన్‌లను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది, అంటే నెలకు 100 వ్యాగన్‌లు. తదనంతరం, రెండవ సంవత్సరంలో తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 2400 వ్యాగన్‌లకు పెంచే అవకాశం ఉంది.

• కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రాంతంలో నూతన పారిశ్రామిక అభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది మరియు ఈ ప్రాంతంలోని ప్రజల సామాజిక-ఆర్థిక పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: