ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈ నెల 31వ తేదీన జరగబోయే సహకార సంఘం కళాశాల భూమి పూజకు సహకార, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రానున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు.బుధవారం
ములుగు రోడ్డు లోని సునీల్ గార్డెన్స్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
మాట్లాడుతూ ఒక్కరి కోసం అందరం - అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా అనేక రంగాల వారు సహకార సంఘాలు గా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకరికి ఒకరు అండ గా నిలబడుతూ సహకార సంఘాలని బలోపేతం చేశారు అని తెలిపారు.అదేవిధంగా సహకార సంఘాల విజ్ఞప్తి మేరకు సహకార కళాశాల ఏర్పాటు కొరకు మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి ని మరియు జిల్లా కలెక్టర్ ని కోరిన వెంటనే హన్మకొండ అంబేద్కర్ భవన్ ప్రక్కన స్థలాన్ని కేటాయించడం జరిగింది అని తెలిపారు. కావున కళాశాల ఏర్పాటు కొరకు ఈ నెల 31వ తేదీన భూమి పూజ కార్యక్రమం అనంతరం అంబేద్కర్ భవన్ లో సహకార సంఘాల సమావేశం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు కావున సభ్యులు అందరు పెద్ద ఎత్తున హాజరు అయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , కార్పొరేటర్లు విజయ లక్ష్మీ సురేందర్, నర్సింగ్ ,కల్పలత సూపర్ బజార్ ఎండి జగన్మోహన్ రావు, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ షఫీ, సహకార సంస్థ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్, సహాకార సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: